బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే  రెండు తెలుగు రాష్ట్రాల్లో నిబంధనల మేరకు థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న చిన్న సినిమాలు కొన్ని ఓటీటీ వైపు చూస్తున్నాయి.




ఆగస్టు 27న ‘శ్రీదేవి సోడా సెంటర్’


సుధీర్‌బాబు‌, ఆనంది కీలక పాత్రల్లో  కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ లవ్‌స్టోరీ ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సుధీర్‌ నటన మునుపెన్నడూ లేనివిధంగా ఆకట్టుకునేలా ఉందనే ప్రశంసలు అందుకున్నాడు. ప్రేమతో ఒక్కటైన సూరిబాబు – శ్రీదేవిలను కులం పేరుతో పెద్దలు విడదీశారా? శ్రీదేవికి వేరే వ్యక్తినిచ్చి పెళ్లి చేశారా? సూరిబాబు జైలుకి వెళ్లడానికి కారణమేమిటి? వంటి ఎన్నో ప్రశ్నలను ట్రైలర్ లో వదిలారు యూనిట్. ఆగస్టు 27న థియేటర్‌లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?


 




ఆగస్టు 27న ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’


సెన్సార్ సహా అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న సుశాంత్ మూవీ ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ కూడా ఈ నెల 27న  విడుదల కానుంది. ప్రమోషన్లో వేగం పెంచిన టీమ్ తాజాగా  నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కథ కథనంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందంటున్నారు సినీ ప్రియులు. ఎస్ దర్శన్‌కు మొదటి సినిమా అయినప్పటికీ అన్ని కమర్షియల్ అంశాలతో తెరక్కించాడని అంటున్నారు.


Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా...ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!


 




ఆగస్టు 27న ‘హౌజ్‌ అరెస్ట్‌’,  ‘వివాహ భోజనంబు’.


శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్‌ కలిసి నటించిన చిత్రం ‘హౌజ్‌ అరెస్ట్‌’. శేఖర్‌ రెడ్డి యర్నా దర్శకుడు.  మూవీకూడా  ఆగస్టు 27నే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాస్య నటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’ కూడా ఇదే రోజు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.


Also Read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్


 




ఆగస్టు 27న ‘కసడ తపర’


సందీప్‌ కిషన్‌, రెజీనా, హరీశ్‌ కల్యాణ్‌, వెంకట్‌ ప్రభు, విజయ లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘కసడ తపర’. చింబు దేవన్‌ దర్శకుడు. ఆరు వేర్వేరు కథలు ఒక పాయింట్‌తో కనెక్ట్‌ అయితే వారి జీవితాల్లో ఏం జరిగింది? ఎవరి కథ ఏంటి?. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన కసడ తపర ఆగస్టు 27న సోనీలివ్‌ వేదికగా  స్ట్రీమింగ్‌ కానుంది.


ఎస్ ఆర్ కళ్యాణ మండపం ఇప్పుడు ఓటీటీలో


కిర‌ణ్ అబ్బవ‌రం, సాయికుమార్‌, ప్రియాంక జ‌వాల్కర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం. శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ థియేటర్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈవారం ‘ఆహా’ వేదికగా ఆగస్టు 28న స్ట్రీమింగ్‌  కానుంది.


ఆగస్టు ఆఖరి వారంలో రిలీజ్ ల వివరాలు


నెట్‌ఫ్లిక్స్‌ 


భూమిక (ఆగస్టు 23)


ద విచ్చర్‌ (ఆగస్టు 23)


అన్‌టోల్డ్‌ (ఆగస్టు 24)


పోస్ట్‌ మార్టమ్‌ (ఆగస్టు 25)


హీజ్‌ ఆల్‌ దట్‌ (ఆగస్టు 27)


అమెజాన్‌ ప్రైమ్‌


స్టాండప్‌ షార్ట్స్‌ (ఆగస్టు 26)


ద కొరియర్‌ (ఆగస్టు 27)


జీ 5


ఇంజినీరింగ్‌ గర్ల్స్‌ (ఆగస్టు 27)


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ 


ద ఎంపైర్‌ (ఆగస్టు 27)


సోనీ లివ్‌


వివాహ భోజనంబు (ఆగస్టు 27)


కసడా తపరా (ఆగస్టు 27)


ఆహా...


ఎస్‌.ఆర్‌ కల్యాణమండపం (ఆగస్టు 27)


ఎంఎక్స్‌ ప్లేయర్‌ 


సబ్‌ కా సాయి (ఆగస్టు 26)


Also Read: వామ్మో సారా.. ఇలా అందాలు ఆరబోస్తే కుర్రకారు పరేషాన్ కారా?!