Godfather Movie Update: చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్? తెలుగులో తొలిసారిగా..

లూసిఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ లో డాన్ క్యారెక్టర్లో సల్మాన్ నటిస్తాడా లేదా అనే ప్రశ్నకి సమాధానం దొరికేసింది. ఇప్పటికే ఈ మూవీకోసం సల్మాన్ భాయ్ డేట్స్ కేటాయించేశాడని టాక్. ఆ వివరాలేంటో చూద్దాం

Continues below advertisement

ఆరు పదులు దాటినా యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఓ మూవీ పట్టాలపై ఉండగానే మరికొన్ని  ప్రాజెక్టులను మొదలు పెడుతూ సత్తా చాటుతున్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' మూవీ ఇంకా పూర్తికాకముందే మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'లూసీఫర్' రీమేక్‌ను 'గాడ్ ఫాదర్' అనే టైటిల్‌తో మొదలు పెట్టేశారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమై వార్త వైరల్ అవుతోంది.

Continues below advertisement

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్' మూవీలో నయనతార, సత్యదేవ్ పోషించే పాత్రల గురించి ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది దీని ప్రకారం.. మలయాళంలో మంజు వారియర్ పాత్రలో నయనతార... వివేక్ ఒబెరాయ్ రోల్‌ లో సత్యదేవ్ నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. గాడ్ ఫాదర్' మూవీలో హీరో పాత్రకు సహాయం చేసే ఓ డాన్ రోల్ కూడా ఉంటుంది. మలయాళంలో ఆ పాత్రను పృథ్వీ రాజ్ సుకుమారన్ చేశాడు. అయితే తెలుగులో ఆ క్యారెక్టర్లో  సల్మాన్ ఖాన్‌ అని ప్రచారం జరిగింది. వెంటనే కండలవీరుడు ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ‘గాడ్ ఫాదర్’ మూవీలో డాన్ రోల్ ని సల్మానే చేస్తున్నాడట. ఇందుకు ఆయన డేట్స్ కూడా ఇచ్చేశాడట. 

Also Read: తల్లి అంజు భవాని బర్త్‌డే వేడుకలో దీపికాతో రణవీర్ సింగ్ హంగామా

Also Read:చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడా? బన్నీయే మెగాస్టార్ అంటూ చిరు ఫ్యామిలీలో ఆర్జీవి చిచ్చు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు, మల్టీ స్టారర్ సినిమాల పోకడ కనిపిస్తోంది. హీరోలు కూడా తమ పరిధిని, మార్కెట్‌ను పెంచుకుంటూ వెళుతున్నారు.  ఈ ఆలోచనతోనే సల్మాన్ ఖాన్ కూడా చిరుతో కలసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడని టాక్.  ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేశాడట. ఇక సల్మాన్ ఖాన్ కు,  చిరంజీవి ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ ఉద్దేశంతోనే భాయ్ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్  డేట్స్ కి అనుగుణంగా చిరంజీవి కూడా తన కాల్షీట్లను మార్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అవసరమైన ఈ మూవీ షెడ్యూల్‌ను ముంబైలో జరపడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సల్మాన్ తన సినీ హిస్టరీలో తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. గతంలో సంజయ్ దత్ కూడా నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. 

Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా... ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!

Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?

Also read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్

Continues below advertisement
Sponsored Links by Taboola