‘మౌనరాగం’ సీరియల్‌లో తన హవభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్. మూగ అమ్మాయి పాత్రలో జీవించేసి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల ఫాలోయింగ్ పెంచుకుంది.  'మౌనరాగం' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. కన్నడలో ఓ సినిమాలో నటించింది. తెలుగులో ‘గోలిసోడా’, ‘చల్తే చల్తే,’ ‘వినరా సోదరా వీరకుమారా’, ‘ఎవడూ తక్కువ కాదు’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం అమ్ములు జానకిగా.. ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. సీరియల్‌లో ఎంతో పద్దతిగా సంప్రదాయంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో రచ్చ చేస్తుంటుంది.  


  ప్రియాంక తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఏముందంటే.. ప్రియాంక జైన్ అమ్మ నాన్న 24వ పెళ్లి రోజు జరుపుకుంటున్నట్టు చెప్పిన జానకి వారికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చింది. అప్పట్లో పెద్దల సమక్షంలో పెళ్లి జరగలేదని అందుకే ఇప్పుడు కుటుంబంతో కలిసి అద్భుతంగా పెళ్లి చేస్తున్నట్టు ప్రియాంక జైన్ చెప్పుకొచ్చింది. 



‘‘అమ్మ, నాన్న 24వ వివాహ వార్షికోత్సవం. వారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కాబట్టి.. వారికి మళ్లీ పెళ్లి చేయిస్తున్నాం ఈ రోజు’’ అని ప్రియాంక తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే, తన తల్లిదండ్రులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని చెప్పడాన్ని నెటిజనులు తప్పుబడుతున్నారు. ఆ మాట అనకుండా ఉండే బాగుండేదని హితవు పలుకుతున్నారు. మొత్తానికి ప్రకాశ్ రాజ్ కొడుకు తరహాలోనే అమ్ములు కూడా తన తల్లిదండ్రలకు పెళ్లి చేసి వార్తల్లోకి ఎక్కింది. 



ఈ మధ్య ప్రకాశ్ రాజ్ కూడా తన భార్య పోనీవర్మని మళ్లీ పెళ్లిచేసుకున్నాడు.  ‘‘మేమిద్దరం పెళ్లి చేసుకొని పదకొండేళ్లు కావటంతో పెళ్లిరోజు సెలబ్రేషన్స్‌ చేసుకున్నాం. ఈ సందర్భంగా మా కొడుకు వేదాంత్ మా పెళ్లిని చూడలేదని అన్నాడు. అతడి కోరిక మేరకు రాత్రికి రాత్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాం’’ అని చెప్పిన ప్రకాశ్ రాజ్...ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 


Also Read:బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?


Also Read: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ


Also Read: ‘వివాహ భోజనంబు’ మూవీ ఆన్‌లైన్‌లో లీక్.. సందీప్‌కు షాకిచ్చిన తమిళ్ రాకర్స్


Also Read: గుడ్‌న్యూస్.. RRR షూటింగ్‌కు శుభం కార్డు.. మొదలు పెట్టిన సీన్‌తోనే ముగింపు