దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు 40 వేలకు పైనే నమోదయ్యాయి. అయితే మరణాలు తగ్గుముఖం పట్టాయి. కానీ కేరళలో వైరస్ ఉద్ధృతి అలానే ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.
- కొత్త కేసులు: 44,658
- కొత్త మరణాలు: 496
- మొత్తం కేసులు: 3,26,03,188
- మొత్తం రికవరీలు: 3,18,21,428
- యాక్టివ్ కేసులు: 3,44,899
- మొత్తం మరణాలు: 4,36,861
మొత్తం కేసుల సంఖ్య 3.26 కోట్లకు చేరగా 4,36,861 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో తగ్గని ఉద్ధృతి..
కేరళలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజు 30వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 162 మంది మరణించారు. కొద్ది రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
కర్ణాటకలోనూ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 1213 కేసులు నమోదుకాగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
జనవరిలో ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటివరకు 61.22 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 79,48,439 మంది టీకా వేయించుకున్నారు.