దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న నేపథ్యంలో అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోస్, ప్రమోషన్ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారైన సమయానికి విడుదల అవుతుందో లేదా అనేది కూడా అనుమానమే. 



Alsoo Read: ప్రభాస్ లుక్‌ చూసి అంతా షాక్.. ‘అంకుల్’ అంటూ నెటిజనులు ట్రోలింగ్


మొత్తానికి ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. కొన్ని పికప్ షాట్స్ మినహా మిగతా షూట్ పూర్తి చేశామని పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2018 నవంబర్ 19న ప్రారంభించిన ఏ బైక్ షాట్‌తో షూటింగ్ మొదలు పెట్టారో.. అదే షాట్‌తో అనుకోకుండా ఈ రోజు RRR షూటింగ్ ముగించామని చిత్రయూనిట్ తెలిపారు.  ఈ సినిమా అప్‏డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నట్లుగా ఆర్ఆర్ఆర్ టీం తెలిపింది.  ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా…శ్రియా శరణ్, అజయ్ దేవ్‏గన్‏లు కీలక పాత్రలలో నటించారు.






Also Read: ‘చెప్పు తెగుద్ది వె*వ’.. అమెరికా అధ్యక్షుడిపై హీరో నిఖిల్ ఆగ్రహం, ఎందుకంటే..


ఇటీవల ఉక్రెయిన్‌ వెళ్లిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీమ్‌ కొన్ని కీలక సన్నివేశాలు, పాటలను చిత్రీకరించింది. ఇప్పటికే విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌ అలరిస్తోంది. పీరియాడిల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌లు నటిస్తున్నారు. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: హాస్పిటల్‌లో సంజన గల్రానీ.. దేవుడిపైనే భారమంటున్న రాగిణి ద్వివేది


Also Read: జాన్వీ కపూర్.. ఈమె అందాలు చూస్తే ‘అమ్మ బ్రహ్మదేవుడో..’ అనాల్సిందే!


Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?