ఏడాది క్రితం శాండల్‌వుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్‌ ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. రాగిణి ద్వివేది, సంజన నుంచి శాంపిల్స్ తీసుకున్న సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ(CFSL) వాళ్లిద్దరూ డ్రగ్స్ తీసుకున్నారని రిపోర్ట్ విడుదల చేయడంతో మళ్లీ కలకలం మొదలైంది. అయితే ఈ కేసులో నిందుతురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె తల్లీ రేష్మా గల్రాని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, పేదలకు నిత్యం అన్నదానం చేస్తున్నామని చెప్పారు. 


 ఈ కేసులో మరో నిందితురాలైన రాగిణి ద్వివేది కూడా స్పందించింది. ‘‘దేవుని ప్లాన్‌పై నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం’’ అని తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్‌ చేసింది. ఈ కేసు తర్వాత ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించింది. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్‌‌ను సంప్రదిస్తున్నానని తెలిపింది. 


Also Read: చిక్కుల్లో హీరోయిన్ సంజన, రాగిణి.. డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు


కన్నడ చిత్ర సీమలో ఎంతోమంది ప్రముఖులు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రాగిణి ద్వివేది - సంజన గల్రానితో పాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురుని సీసీబీ అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల వినియోగం - సరఫరా కేసులో సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని.. సెప్టెంబర్ 9న సంజనను అరెస్ట్ చేశారు. ఇద్దరూ 3 నెలలకు పైగా బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చారు.


డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది - సంజనా గల్రాని తో పాటు మరో 25 మందిపై చార్జిషీట్ ఫైల్ అయింది.  2019 మే 26న రాగిణి ద్వివేది బర్త్ డే పార్టీలో డ్రగ్స్ సరఫరా చేయడం.. ప్రియుడు రవిశంకర్ తో కలసి ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీలో ఎక్స్టసీ డ్రగ్ మాత్రలు తీసుకోవడం.. ఇతరులకూ సరఫరా చేయడం వంటి వాటిని ఈ చార్జిషీట్ లో ప్రస్తావించారు. అలానే సంజనకు డ్రగ్స్ వినియోగం, సరఫరాతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. FSL రిపోర్టులో హీరోయిన్లు ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర.. రాష్ట్రంలో మత్తు దందాను నియంత్రిస్తామన్నారు. మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. 


Also Read: హ్యాపీ బర్త్ డే ప్రియదర్శి.. కెమెరా మ్యాన్ అవ్వాలనుకుని నటుడయ్యాడు, సీనియర్‌తో పెళ్లి!


Also Read:వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!


Also Raed: క్లీన్‌చిట్ ఇచ్చిన కేసులో ఈడీ నోటీసులా..? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెర వెనుక ఏం జరుగుతోంది..?


Also Read: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..