ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1515 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 68,865 శాంపిళ్లను పరీక్షించగా ఈ మేరకు వెల్లడైందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 20,09,245కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం తూర్పు గోదావరి (223), నెల్లూరు (202), చిత్తూరు (199), కృష్ణా (163), పశ్చిమ గోదావరి (143) జిల్లాల్లో నమోదయ్యాయి. 





గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా 10 మంది మరణించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో కోవిడ్ బాధితుల్లో 903 మంది కోలుకున్నారని.. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 19,80,407కిచేరిందని పేర్కొంది. 


రాష్ట్రంలో 75 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి.. 
ఏపీలో 18 ఏళ్లకు పైబడిన వారిలో 75 లక్షల మంది రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక 2 కోట్ల మందికి పైగా ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపింది. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారు.. తమ దగ్గర్లోని వ్యాక్సిన్ సెంటర్లలో టీకాలు వేయించుకోవాలని సూచించింది.





2 కోట్ల మందికి పైగా..






తెలంగాణలో 339 కోవిడ్‌ కేసులు.. 


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 80,568 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ మేరకు వెల్లడైంది. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 3,867కి చేరింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నిన్న ఒక్క రోజే 417 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 6.46 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Also Read: Highcourt Aided Colleges : ఏపీ ఎయిడెడ్ కాలేజీల్లో అడ్మిషన్లు కొనసాగించాలన్న హైకోర్టు.. జీవోలపై విచారణకు నిర్ణయం.. !


Also Read: Rajasthan CM Health: ఆసుపత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్