సూపర్ స్టార్ రజనీకాంత్ 72వ పుట్టినరోజు నేడు. కేవలం సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన మహానటుడు ఆయన. రజనీ చేసిన ప్రతి సినిమాల్లోనూ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. కొన్ని మనసుకు హత్తుకుంటే మరికొన్ని పవర్‌ఫుల్ పంచ్‌లా ఉంటాయి. ఏవైనా అవన్నీ సమాజంలో మంచిని పెంచేలానే ఉండడం విశేషం. అతని సినిమాలో గుర్తుండిపోయినా, పాపులర్ అయిన డైలాగులే ఇవన్నీ.
1. అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు - నరసింహా
2. మంచివాడు మొదట కష్టపడతాడు... కానీ ఓడిపోడు
చెడ్డ వాడు ముందు సుఖపడతాడు... కానీ ఓడిపోతాడు - భాషా
3. నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు - భాషా
4. నాన్నా... పందులే గుంపుగా వస్తాయ్, సింహం సింగిల్ గా వస్తుంది - శివాజీ
5. తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత - బాబా
6. న్యాయానికి బంధం, బంధుత్వం ఒక్కటే... ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు - పెదరాయుడు
7. నా దారి... రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే - నరసింహా
8. దేవుడు శాసించాడు... అరుణాచలం పాటిస్తాడు - అరుణాచలం
9. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావాల్సినంత ఉంచుకుని మిగిలించి దానం చేస్తేనే మనశ్శాంతి - ముత్తు
10. ఒక్కసారి తప్పుచేసిన వాడిని క్షమిస్తే వాడికి మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే - పెదరాయుడు
11. నీకున్నది రాజకీయ బలం నాకున్నది ప్రజాబలం. మీరు పోలీస్ శక్తితో బతుకుతున్నారు. నేను ప్రజా శక్తితో బతుకుతున్నా... నా శక్తి ముందు నీ శక్తి జుజుబీ - నరసింహ
12. నా జన్మ విరోధినైనా క్షమిస్తానేమో కాని వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే వారిని అసలు క్షమించను.
Read also: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Read also: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?
Read also: ఈసారి ‘గాలివాన’తో వస్తున్న జీ5.. ఓటీటీ లవర్స్‌కు గుడ్‌న్యూస్!
Read also: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Read also: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కవల పిల్లలు..