బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న లోబో మరోసారి తండ్రయ్యారు. ఇప్పటికే ఆయనకు ఒక ఆడపిల్ల ఉండగా.. ఈరోజు ఆయన భార్య కవలలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబు పుట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లోబో స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించినట్లు ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు లోబో. అయితే ఫొటో షేర్ చేసిన కాసేపటికే డిలీట్ చేశారు. 


బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే లోబో.. తన భార్య గర్భవతి అని చెప్పారు. ఆమెకి తోడుగా లేకపోవడంతో చాలా ఎమోషనల్ అయ్యారు. హౌస్ లో చాలా సార్లు తన భార్యా, బిడ్డను తలచుకొని ఏడ్చారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. లోబోకి సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ షో అతడికి మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. హౌస్ లో ఉన్నంతకాలం అందరినీ నవ్విస్తూ.. బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచారు. కానీ సొంతంగా గేమ్ ఎప్పుడూ ఆడింది లేదు. రవి చెప్పేది వింటూ.. అతడిని ఫాలో అయిపోయేవారు. సీక్రెట్ రూమ్ లో ఉండి గేమ్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చినా.. లోబో దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు. దీంతో సీక్రెట్ రూమ్ నుంచి ఇంట్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఎలిమినేట్ అయిపోయారు. 


ఇక షో నుంచి ఎలిమినేట్ అయిన తరువాత తన ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు. కెరీర్ పరంగా కూడా లోబోకి మంచి అవకాశాలే వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో లోబోకి ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు లోబో. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో రవి ఉన్నంతకాలం అతడిని సపోర్ట్ చేసిన లోబో.. ఇప్పుడు షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తున్నారు. 


Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..


Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?


Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...


Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!


Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి