యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ.. రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా చాలా ప్రాంతాలకు తిరుగుతున్నారు. 


రీసెంట్ గా జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఈ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఎన్టీఆర్ కి కార్లు, వాచ్ లంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఎన్టీఆర్ కి నచ్చితే చాలు.. రేటు చూడకుండా కొనేస్తారు. తాజాగా 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ మీట్ లో ఆయన పెట్టుకున్న వాచ్ ఎంత ఉంటుందా..? అని గూగుల్ చేసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆ వాచ్ ధర అక్షరాల రూ.4 కోట్లు. 




రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ అది. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్ లలో ఒకటి. ఇదే బ్రాండ్ లో గోల్డ్ లోటస్ F1 టీమ్ లిమిటెడ్ ఎడిషన్ కూడా చాలా కాస్ట్లీ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఈ బ్రాండ్ వాచ్ నే ధరించారు. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. 


రెండు, మూడేళ్ల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా.. కళ్యాణ్ రామ్ ఒక వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దాని ధర రూ.2 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. మొత్తానికి నందమూరి హీరోలు వాచ్ ల కోసమే కోట్లలో ఖర్చు చేస్తున్నారంటే.. వాటిపై ఎంత ఇష్టముందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...


Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!


Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?


Also Read: టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్ మాట్లాడతారా?


Also Read: దేవిశ్రీ ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ఊ అంటారా... ఉఊ అంటారా?


Also Read: 'న‌యీం డైరీస్‌'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి