బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకున్నారు. ఇక మిగిలిన ఐదుగురు సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ టాప్ 5కి చేరుకుంటారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. 


ఇదిలా ఉండగా.. తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో నాగార్జున ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసి హౌస్ మేట్స్ తో 'వీల్‌ ఆఫ్‌ ది వీక్స్‌' అనే టాస్క్ ఆడించారు. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ కి తమ జర్నీలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎవరేం చేస్తారు..? ఏం చేయకుండా ఉంటారనే..? ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. 


ముందుగా కాజల్.. తనకు ఏ వీకో గుర్తులేదని అనగా.. 'నీకు గుర్తులేదా కాజల్..? అది ఎలా పాజిబుల్' అంటూ కౌంటర్ వేశారు. ఆ తరువాత సిరి 'లెవెన్త్ వీక్ సార్' అని చెప్పింది. 'ఏం చేశాడు షన్ను..?' అని అడిగారు నాగార్జున. దానికి షణ్ముఖ్ తలబాదుకోగా.. హౌస్ మేట్స్ నవ్వేశారు. ఒక్కొక్కరూ కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి తమ నాగార్జునతో మాట్లాడారు. పదకొండో వారం తాను చేసిన దానికి బాధపడుతున్నట్లు షణ్ముఖ్‌ చెప్పాడు. వెనక్కి వెళ్లే ఛాన్స్ వస్తే తాను అలా చేసుకోనని సిరి చెప్పింది. చాలా బాధపడ్డానని, తట్టుకోలేకపోయానని సన్నీ.. ఫస్ట్ టైం సన్నీ ఏడవడం చూసి, నేను కూడా ఎమోషనల్ అయిపోయానని మానస్ చెప్పారు. 


ఆ తరువాత హౌస్ మేట్స్ ని హిట్ స్టార్ ఎవరు..? ఫ్లాప్ స్టార్ ఎవరు..? అని ప్రశ్నించారు నాగ్. ముందుగా కాజల్.. షణ్ముఖ్ కి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ పెట్టింది. శ్రీరామ్.. కాజల్ కి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ పెడుతూ.. 'స్వీట్ కాజల్ ఉంటుంది.. కన్నింగ్ కాజల్ ఉంటుంది.. అందులో ఏది కరెక్టో నాకు అర్ధం కావడం లేదని' రీజన్ చెప్పాడు. సిరికి ఫ్లాప్ స్టార్ ఇచ్చిన సన్నీ.. హౌస్ లో ఆమె ఒక్కదానితోనే పంచాయితీ ఉందని అన్నాడు. సిరి కూడా సన్నీకి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ ఇస్తూ.. ఎక్కువ నెగెటివిటీ క్యారీ చేయడం ఫస్ట్ నుంచి సన్నీలో నచ్చలేదని రీజన్ చెప్పింది. ఫైనల్ గా ప్రోమోలో శ్రీరామ్ 'నెక్స్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5' అని చెప్తూ సస్పెన్స్ లో పెట్టేశాడు.