బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, విందుభోజనాలు... ఇవన్నీ పొట్ట నిండేలా లాగించేస్తారు చాలా మంది. అయితే కడుపునిండా తిన్నాక ఇబ్బంది పడుతుంటారు. అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అటువంటి పరిస్థితిలో వెంటనే తేలికగా అనుభూతి చెందడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. 


1. చిన్నపాటి నడక
బ్రేక్ ఫాస్ట్ కావచ్చు, లంచ్ లేక డిన్నర్ ఏదైనా కావచ్చు అతిగా తిన్నాక కచ్చితంగా కాసేపు నడవండి. పది నిమిషాల పాటూ నడవడం వల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపించే ఫీలింగ్ తగ్గిపోతుంది. అంతే కాదు భోజనంతో పాటూ మనం కాస్త గాలిని కూడా మింగేస్తాం. అది కూడా బయటికి వచ్చేస్తుంది. జాగింగ్ మాత్రం చేయకండి. 


2. చురాన్ తాగండి
ఇంట్లోనే చురాన్ ను తయారుచేసుకుని తిన్నాక నమిలితే మంచిది. పావు స్పూను వాము గింజలు, పావుస్పూను జీలకర్ర, పావు స్పూను సోంపు గింజలు, చిన్న ఇంగువ ముక్క కలిపి మెత్తని పొడిలా చేయండి. ఈ పొడిని కొంచెం నీటిలో కలిపి నోట్లో వేసుకుని నమిలి మింగండి. త్వరితంగా జీర్ణప్రక్రియ సాగుతుంది. నిండిన పొట్ట త్వరగా ఫ్రీ అవుతుంది. 


3. నిమ్మనీరు
శరీరంలోని అదనపు సోడియంను బయటికి పంపేందుకు డిటాక్సిఫికేషన్ అవసరం. మంచి డిటాక్స్ వాటర్ ‘నిమ్మనీరు. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. ఆ నీటిని మెల్లగా సిప్ చేయండి. ఒకేసారి తాగేయకండి. అలాగే భోజనం తరువాత జీరా టీ, ఫెన్నెల్ టీ, లెమన్ గ్రాస్ టీ తాగినా మంచిదే. 


4. పడుకోవద్దు
భారీగా భోజనం చేశాక భుక్తాయాసంతో ఎక్కువమంది మంచంపై చేరబడతారు. కొంతమంది నిద్రపోతారు కూడా. అది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. వికారంగా కూడా అనిపించవచ్చు. భోజనం చేశాక కూర్చోవడం లేదా కాసేపు నడవడం ఉత్తమం. 
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Read Also:  థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
Read Also:  మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
Read Also:   పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Read Also: పాలలో చిటికెడు పసుపు... దీని వేడి ముందు చలి మంట కూడా బలాదూర్
 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి