శీతాకాలంలో శరీర ఉస్ణోగ్రతలు తగ్గిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకు తగ్గ ఆహారాపదార్థాలని కూడా తినాలి. చాలా మంది రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు, శరీరపు ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకునేందుకు గ్లాసుడు పాలలో పసుపు కలుపుకుని తాగమని చెబుతారు. కానీ చాలా మంది దీన్ని ఫాలో అవ్వరు. ఆరోగ్యనిపుణులు మాత్రం చలికాలంలో రోజుకో గ్లాసు పసుపు పాలు తాగితే చాలా మంచిదని చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలను ఇలా చెప్పుకొస్తున్నారు...
1. పసుపు కలిపిన పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.
2. శరీరం లోపలి నొప్పులను నయం చేయడంలో ఇది సహకరిస్తుంది.
3. చలికి బిగుసుకుపోయిన కండరాలను సడలించి పనులు చురుగ్గా చేసుకునేలా చేస్తుంది.
4. పేగుల్లోని చెడు బ్యాక్టిరియాను చంపి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
5. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఇలా చేసుకుని తాగితే మంచిది
అందరూ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగేస్తారు కానీ... మరిన్ని ఆరోగ్య లాభాలు పొందాలంటే తయారుచేసే పద్ధతి మార్చాలి.
ఒక అరస్పూను నెయ్యిని వేడి చేయాలి. ఆ నెయ్యిలో అర స్పూను పసుపు, అరస్పూను మిరియాల పొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, చిటికెడు జాజికాయ పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పాలల్లో వేసి కలుపుకుని తాగేయాలి. ఇలా తాగితే చలికాలంలో కలిగే అలెర్జీలు, రోగాలు మీ దరి చేరవు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. చలిని తట్టుకునే శక్తి వస్తుంది.
Read Also: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
Read Also: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Read Also: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం
Read Also: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు
Read Also: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు
Read Also: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...
Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
Read Also: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి