దసరా నవరాత్రులకో, సంక్రాంతి పండుగకో, గుడిలో ప్రసాదానికో తప్ప సాధారణంగా కట్టె పొంగలి ఇంట్లో చేసుకోరు. నిజానికి అది చాలా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన శరీరానికి కావాల్సిన పోషకాలన్నింటినీ అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో కట్టెపొంగలి శరీరానికి మేలుచేస్తుంది. ఈ సీజన్లో మారుతున్న కాలానికి తగ్గట్టు వేడిని, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కట్టె పొంగలి తినడం కలిగే లాభాలు ఇవే...
1. ఇందులో ప్రోటీన్లు, ఎంజైమ్లు, క్లోరోఫిల్, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు అందుతాయి.
2. కొలెస్ట్రాల్ శాతం సున్నా. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుందన్న భయం అవసరం లేదు.
3. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
4. కట్టె పొంగలిలో వేసే మిరియాల వల్ల మలబద్ధకం సమస్య దరిచేరదు.
5. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.
6. దగ్గు, జలుబు ఉన్నప్పుడు తినాల్సిన వంటకం కట్టె పొంగలి.
7. ఇందులో వాడే అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది.
8. వికారం లక్షణాలను తగ్గిస్తుంది.
కట్టె పొంగలి చేసే పద్ధతి
కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
బియ్యం - ఒక కప్పు
మిరియాలు - పావు కప్పు
నెయ్యి - నాలుగు స్పూనులు
పచ్చి మిర్చి - అయిదు
జీలకర్ర - రెండు టీస్పూనులు
ఉప్పు - రుచికి తగినంత
కరివేపాకు - గుప్పెడు
తయారు చేసే విధానం
బియ్యం, పెసరపప్పు కలిపి తగినన్నీ నీళ్లు పోసి నానబెట్టాలి. మరోవైపు స్టవ్ పై గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. తగినన్నీ నీళ్లు పోసి మరిగించాలి. అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పప్పును మరిగిన నీళ్లలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. మెత్తగా ఉడికించుకోవాలి. పైన ఒక స్పూను నెయ్యి వేసి ఆపేయాలి. అంతే కట్టె పొంగలి సిద్ధం.
Read Also: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు
Read Also: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు
Read Also: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...
Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...
Read Also: కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు
Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి