గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 5 లక్షల 30వేల రూపాయల విలువగల 53 కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన.. సోయం వీరబాబు, సమీర్ హల్దార్ ఉన్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తులకూ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. 


ఈ అరెస్టుకు సంబంధించి.. వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులతోపాటు, ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు ఒక ముఠా ఏర్పడినట్టు తెలిపారు.  సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోని చింతలూరు, ఒడిశా రాష్ట్రంలోని మల్కాజ్గిరి ప్రాంతాల్లో రహస్యంగా సేకరించిన గంజాయిని మధ్యవర్తుల ద్వారా తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహరాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ స్మగ్లర్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ముఠాలోని సభ్యులు సోయం వీరబాబు, కోస్రా రాజు, సమీర్ హల్దార్ మధ్యప్రదేశ్ కు చెందిన స్మగ్లరుకు నెక్కొండ ప్రాంతంలో గంజాయిని అందజేసేందుకుగానూ వెళ్లారు. 


ఈ ముగ్గురు నిందితులు 53 కిలోల గంజాయిని రెండు కిలోలు మరియు ఐదు కిలోల ప్యాకేట్ల రూపంలో రెండు ద్విచక్ర వాహనాలపై రాజమండ్రి, భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, నర్సంపేట, మీదుగా నెక్కొండకు వస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. పోలీసులు స్థానిక చెన్నారావుపేట పోలీసులతో కలిసి.. చెన్నరావుపేట గ్రామ శివారు ప్రాంతంలో ఈ రోజు ఉదయం తనీఖీ చేశారు. ద్విచక్రవాహనాలపై వస్తున్న నిందితులను చూసి అనుమానంతో ఆపేసి తనిఖీలు చేశారు. వెనకు కూర్చున్న కోస్రా రాజు తప్పించుకోని పారిపోగా మరో ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. వీరి ద్విచక్ర వాహనంపై వున్న ప్యాకేట్లను పోలీసులు పరిశీలించగా వాటిలో వున్నది గంజాయిగా తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. తప్పించుకొని పారిపోయిన మరో నిందితుడు గురించి పోలీసులు చుట్టు పక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు.


Also Read: Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం


Also Read: Suryapet: జడ్పీటీసీ హత్య కోసం భారీ కుట్ర.. భగ్నం చేసిన సూర్యాపేట పోలీసులు, వెలుగులోకి ఇలా..


Also Read: TSRTC: ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..


Also Read: Singareni : సింగరేణిలో మూడు రోజుల పాటు ఉత్పత్తి బంద్ .. సంపూర్ణంగా కార్మికుల సమ్మె !