వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశాలపై మాట్లాడుతున్నారు. లోక్‌సభలో గురువారం మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారని దీని వెనుక పెద్ద స్కాం ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా స్ఫూర్తికి విరుద్ధంగా లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయన్నారు. మద్యం షాపుల్లోఎక్కడా డిజిటల్ లావాదేవీలు జరగడం లేదని నగదు మాత్రమే తీసుకుంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఏపీలో మద్యం అమ్మకాల్లో లావాదేవీలపై కేంద్రం దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి జోక్యం చేసుకుని నగదు చెల్లింపుల స్థానంలో డిజిటల్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ఆ దుకాణాల్లో నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రతీ చోటా డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తూంటే ఏపీ మద్యం దుకాణాల్లో మాత్రం నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్నలు విపక్షాలు చాలా కాలంగా వేస్తున్నాయి.
Also Read : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...
నిజానికి నగదు మాత్రమే అనుమతించడం వల్ల అనేక అవకవతకలు దుకాణాల్లో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ. పది కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అంత పెద్ద మొత్తంలో నగదు వసూలవుతుంది. దుకాణాల్లో పని చేసేవారంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో పూర్తి స్థాయిలో బాధ్యతగా వ్యవహరించడంలేదు. అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు దుకాణాల్లో ఇలాంటి అవకతవకలు బయటపడ్డాయి. పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని మంత్రి నారాయణ స్వామి కూడా గతంలో ప్రకటించారు.
Also Read : పేదల ఇళ్లపై ఎప్పుడూ ఏడుపేనా చంద్రబాబు?
వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ఆగస్టులోనే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల్లో వినియోగిస్తున్న సాఫ్ట్ వేర్ మార్పులతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఆ విధానం అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.
Also Read: Tollywood Drugs : టాలీవుడ్ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి