సూర్యాపేటలో ఓ జడ్పీటీసీని హత్య చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్‌ను అంతం చేసేలా సుపారీ తీసుకున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. భూ వివాదాల వల్ల వ్యక్తిగత కక్షలు ఏర్పడడంతో హత్య చేయించేందుకు సుపారీ గ్యాంగ్‌తో హత్యకు ప్రణాళిక వేసినట్లుగా పోలీసులు చెప్పారు. జడ్పీటీసీకి చెందిన ఇద్దరు సమీప బంధువులతో పాటు మరొకరు కుట్ర చేసినట్లుగా తమ విచారణలో వెల్లడి అయిందని చెప్పారు.
ఈ సూత్రధారుల్లో నలుగురిని అరెస్ట్ చేశామని వివరించారు. మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు. జాజిరెడ్డి గూడెం మండల కేంద్రానికి చెందిన జడ్పీటీసీ వీరప్రసాద్ యాదవ్, మరో కులానికి చెందిన లింగంపల్లి జగన్నాథం రెండో భార్య కూతురు మనీషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం జగన్నాథం అనారోగ్యంతో చనిపోగా తలగొరివి పెట్టే విషయంలో గొడవ జరిగింది. జగన్నాథం పెద్ద భార్య కుమార్తె కవితతో తలగొరివి పెట్టించాలని అనుకోగా.. చివరికి రెండో భార్య కుమార్తె శ్వేతతో తలగొరివి పెట్టించారు. అప్పటి నుంచి జగన్నాథం అన్న కొడుకు లింగంపల్లి సుధాకర్, అతడి బంధువులు, వీరప్రసాద్‌కు మనస్పర్థలు వచ్చి గొడవలు మొదలయ్యాయి.
వీర ప్రసాద్ తరచూ జగన్నాథం విషయంలో తలదూరుస్తుండడంతో వీర ప్రసాద్ కొద్ది రోజుల క్రితం తోడల్లుడు శ్రీను, అతడి కుమారుడు అశ్విన్‌లపై అర్వపల్లికి చెందిన మేకల సంతోష్‌పై జరిగిన దాడి విషయంలో తప్పుడు కేసులు పెట్టించాడు. దీంతో వారు జడ్పీటీసీపై కోపం పెంచుకున్నారు.
ఇలా ప్రతి విషయంలో అడ్డుపడుతున్న వీరప్రసాద్‌ను మట్టుబెట్టాలని లింగంపల్లి సుధాకర్, జిన్నే శ్రీను, అలువాల వెంకట స్వామి అనే వ్యక్తులు నిర్ణయించుకున్నారు. అందుకు కిరాయి హంతకులను సంప్రదించారు. దీనిలో భాగంగా ఈ నెల 22న జనగాం క్రాస్ రోడ్డులోని ఓ బార్‌లో జిన్నా శ్రీను మినహా మిగిలిన నలుగురు కలిసి హత్యకు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా చంపేందుకు టౌన్‌లోనే ఆయుధాలు కొన్నారు.
హత్యకు కుట్ర విషయం బయటికి ఇలా..
గంజాయికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందడంతో సీఐ టీమ్ దాడి చేశారు. అక్కడ లింగంపల్లి సుధాకర్, లింగంపల్లి సంజయ్, పోతరాజు సైదులును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కేజీల గంజాయి, రెండు వేట కొడవళ్లు, కంకి కొడవలి స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారణ జరపగా హత్య కుట్ర విషయం బయటపడిందని తెలిపారు.
Also Read: TSRTC: ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..
Also Read: Singareni : సింగరేణిలో మూడు రోజుల పాటు ఉత్పత్తి బంద్ .. సంపూర్ణంగా కార్మికుల సమ్మె !
Also Read: ఆ ఆస్పత్రి ఓన్లీ ఫర్ మంకీస్.. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు స్పెషాలిటీ..! ఎక్కడో తెలుసా ?
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి