ప్రపంచంలోని మానవజాతి మొత్తం ఒక కుటుంబం లాంటివి. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నట్టే, గౌరవం అందినట్టే, ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి ఆ హక్కులు, గౌరవం అందాలి. అదే ఈ ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ముఖ్య ఉద్దేశం. 1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి తొలిసారిగా ‘విశ్వ మానవ హక్కుల ప్రకటన’ చేసింది. ఆ రోజు నుంచి ప్రపంచమంతా డిసెంబర్ 10న ‘మానవ హక్కుల దినోత్సవం’ నిర్వహించుకుంటుంది. మనదేశంలో కూడా ఇదే రోజును హూమన్ రైట్స్ డేగా పరిగణిస్తాం. 1948లో ఐక్యరాజ్యసమితి ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR)’ పేరుతో డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఇది ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే ఒక అధికార పత్రం. దీన్ని ప్రపంచంలోనే అత్యధిక భాషల్లోకి అనువదించారు. దాదాపు 500 భాషల్లోకి ఇది ట్రాన్స్‌లేట్ అయ్యింది.







UDHR ప్రకారం మానవ హక్కులు ఇవే...
ఆర్టికల్ 1 ప్రకారం...
ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే స్వేచ్ఛా, సమానత్వం లభిస్తాయి. రాజు, పేద అనే తేడా లేకుండా అందరికీ సమానమైన గౌరవం హక్కులు ఉంటాయి. 


ఆర్టికల్ 2 ప్రకారం 
మనుషులు అందరూ సమానమే. వారి హోదా, సంపద, కుటుంబ నేపథ్యం... ఇలా దేనివల్లా కూడా వివక్ష చూపడానికి వీల్లేదు. 


ఆర్టికల్ 3 ప్రకారం...
 ప్రతి మనిషికి ఆ దేశ రాజ్యాంగానికి లోబడి స్వేచ్ఛగా జీవించే హక్కు దక్కుతుంది. 


ఆర్టికల్ 4 ప్రకారం...
మీరు ఎవ్వరికీ బానిసలు కాదు, మిమ్నల్ని ఎవరైనా బానిసలుగా ట్రీట్ చేస్తే వారిని ఎదిరించి చట్టపరంగా మీ హక్కులను మీరు కాపాడుకోవచ్చు. 


ఈ హక్కులన్నీ మనవే...
1. జాతి, రంగు, లింగ, కులం, మతంతో సంబంధం లేకుండా మీ జీవితాన్ని మీరు ఆనందంగా సాగించవచ్చు. 
2. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురికాకుండా రక్షణ పొందే హక్కునూ కల్పించింది. 
3. మీకు మనసుకు నచ్చినట్టు స్వేచ్ఛగా స్వదేశంలోనూ, విదేశాలలోనూ కూడా పర్యటించవచ్చు. 
4. నేరస్తులేమో అన్న అనుమానంతో అరెస్టుకు గురైనా కూడా నేరం తేలే వరకు మీరు నిరపరాధుల కిందే లెక్క. నిందితులు కారు. 
5. విద్యాహక్కు, పిల్లలకు ఆడుకునే హక్కు, ఏ మతాన్నయినా స్వీకరించి జీవించే హక్కు... ఇలా మీకు చాలా హక్కులను ప్రసాదించింది. 


మీ హక్కులు మీకు దక్కడం లేదనిపించినప్పుడు, హక్కుల ఉల్లంఘన జరిగిందనిపించి నప్పుడు మీరు న్యాయసహాయం తీసుకోవచ్చు. మీ ఫిర్యాదులను విచారించడానికి కోర్టులే కాదు ప్రత్యేకంగా మానవహక్కుల కమిషన్లు కూడా ఉన్నాయి.


జాతీయ మానవ హక్కుల కమిషన్
ఫరీద్ కోట్ హౌస్, కోపర్నికస్ మార్గ్, న్యూఢిల్లీ - 110001
హెల్ప్ లైన్ నెంబర్-09810298900


Read Also: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?


Read Also: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం


Read Also: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు


Read Also: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు


Read Also: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి