అఖండ సినిమా విడుదలై వందకోట్ల బాక్సాఫీసువైపు పరుగులు తీస్తోంది. మొన్నటివరకు వరుస ఫ్లాఫులు మూటగట్టుకున్న బాలయ్య... ఇప్పుడు అఖండతో మళ్లీ మీసం మెలేశారు. ఈ సినిమాను బాలయ్య వియ్యంకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా వీక్షించారు. అనంతరం మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆ సినిమా గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అఖండ సినిమాలో చూపించారని ఆయన అన్నారు. సినిమా బాగుందని మెచ్చుకుంటారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. థియేటర్లకు రారేమో అనుకున్న ప్రజలను థియేటర్లకు రప్పించింది. మొదటి వారంలోనే సినిమాకైన ఖర్చును వెనక్కి రాబట్టి, ఇప్పుడు భారీ ప్రాఫిట్స్ వైపుగా పరుగులుతీస్తోంది. అతి త్వరలో వందకోట్ల సినిమాల క్లబ్ లో చేరబోతోంది. థమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. బాలయ్య క్రేజ్‌కు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను దంచి కొట్టాడు థమన్. థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలయ్యే రేంజిలో ఉంది అతని సంగీతం.
బోయాపాటి-బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం అఖండ. అంతకుముందు సింహా, లెజెండ్ వీరిద్దరి కాంబోలో వచ్చింది. అఖండ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. శ్రీకాంత్ విలన్‌గా చేయగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
అఖండ విజయం తరువాత బాలయ్య మార్కెట్ బాగా పెరిగింది. ఆయన కాల్షీట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. పాన్ ఇండియా స్థాయి మూవీలు కూడా బాలయ్యతో ప్లాన చేస్తున్నారట కొందరు మూవీ మేకర్స్. ప్రస్తుతం బాలయ్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే పూరీ జగన్నాథ్ తో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అఖండ విజయం తరువాత పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి.
Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి