New Webseries: ఈసారి ‘గాలివాన’తో వస్తున్న జీ5.. ఓటీటీ లవర్స్‌కు గుడ్‌న్యూస్!

బీబీసీ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో జీ5 'గాలివాన‌' అనే వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. ఇందులో రాధికా శరత్ కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Continues below advertisement

బీబీసీ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో 'గాలివాన‌' అనే ఒరిజినల్ సిరీస్‌ను జీ5 నిర్మిస్తోంది. బీబీసీ స్టూడియోస్ నిర్మించిన ఒక యూరోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి 'గాలివాన‌'గా తెరకెక్కిస్తున్నారు.

Continues below advertisement

ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 50 ఏళ్ళ క్రితం మొదలయిన తన కెరీర్‌లో సాయి కుమార్ బాలనటుడిగా, హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా ఎన్నో సినిమాలు చేశారు.

అలాగే, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్ కుమార్ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్ ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి.

ఇటీవలి కాలంలో డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమాను జీ5 విడుదల చేసింది. ప్రజల్ని చైతన్యపరిచే కథతో రూపొందిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అంతే కాకుండా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' కూడా సక్సెస్ అయింది.  

"ఇటీవలే ఈ ఒరిజినల్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టాం. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక బ్రిటిష్ షోను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాం. ఈ వెబ్ సిరీస్‌తో బీబీసీ రీజనల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది." అని నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 'జీ5' సంస్థలు తెలిపాయి. 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..

Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...

Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!

Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Continues below advertisement