ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ఇంకా కేవలం నెల మాత్రమే ఉంది. ఫ్రాంచైజీలు తమ తుదిజట్ల కూర్పుపై ఇప్పటికే మల్లగుల్లాలు పడుతూ ఉంటాయి. నవంబర్ 30వ తేదీన మొత్తం ఎనిమిది జట్లూ తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై, కోల్‌కతా తీసుకున్న రెండు నిర్ణయాలు ఐపీఎల్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేష్ అయ్యర్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రస్తుత ఫాం, ఫ్రాంచైజీలు ఇతర కీలక ఆటగాళ్లను కూడా కాదని వీరిని రిటైన్ చేసుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వీరిద్దరూ ఆయా జట్లతో దీర్ఘకాలిక ప్రయాణం చేసే అవకాశం ఉంది. వీరిద్దరి వయసు కూడా తక్కువే. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వీరిద్దరూ చెన్నై, కోల్‌కతాలను భవిష్యత్తులో ముందుకు నడిపించే అవకాశం కూడా ఉంది.
రుతురాజ్ గైక్వాడ్: దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో అర్థ శతకాలు సాధించాడు. ఇక 2021 ఐపీఎల్‌లో 635 పరుగులు సాధించి.. ఆరెంజ్ క్యాప్‌ను కూడా దక్కించుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
తన సామర్థ్యాన్ని గుర్తించిన సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ.6 కోట్లతో గైక్వాడ్‌ను రిటైన్ చేసుకుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి డీల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా జట్లకు మంచి ఓపెనర్ సమస్య ఉంది. రుతురాజ్ వేలంలోకి వెళ్తే కనీసం రూ.10 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది.
వెంకటేష్ అయ్యర్: ఈ ఆల్‌రౌండర్ సడెన్‌గా సీన్‌లోకి వచ్చాడనే చెప్పాలి. 2021 ఐపీఎల్ మొదటి దశలో కోల్‌కతా ఘోరంగా విఫలం అయింది. అయితే యూఏఈలో రెండో దశ ప్రారంభం అయ్యాక తను శుభ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి ముందుకు వచ్చాడు.
తాజాగా అయ్యర్ అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. బౌలర్‌గా కూడా తన విలువను నిరూపించుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌ను సైతం కాదని కోల్‌కతా వెంకటేష్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోవడం విశేషం. ఇతను కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎక్కువ కాలం ప్రయాణం చేసే అవకాశం ఉంది.
వీరిద్దరూ త్వరలో భారత జట్టులో పూర్తి స్థాయిగా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగి రాణిస్తే మాత్రం.. ఫ్రాంచైజీలకు వీరు విలువైన ఆస్తిగా మారడం ఖాయం. వీరి ప్రస్తుత ఫాం చూస్తే ఆరోజులు కూడా దూరంలో లేవని అనిపించకమానదు.
Also Read: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!
Also Read: ICC Test Rankings: మయాంక్ దూకుడు..! 10 వికెట్ల అజాజ్ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!
Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి