టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ ర్యాంకుల్లో దూసుకుపోయాడు. అతడితో పాటు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అజాజ్‌ పటేల్‌ తమ ర్యాంకులను మరింత మెరుగుపర్చుకున్నారు.


ముంబయి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ వరుసగా 150, 62 పరుగులు చేయడంతో 30 ర్యాంకులు ఎగబాకాడు. బ్యాటర్ల జాబితాలో 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. 2019, నవంబర్లో సాధించిన కెరీర్‌ అత్యుత్తమ పదో ర్యాంకుకు ఒక అడుగు దూరంలో నిలిచాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 21 స్థానాలు మెరుగై 45వ ర్యాంకు దక్కించుకున్నాడు.


ఇక భారత సంతతి ఆటగాడు, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లతో అదరగొట్టిన అజాజ్‌ పటేల్‌ ఏకంగా 23 ర్యాంకులు మెరుగయ్యాడు. ఆ టెస్టులో 14 వికెట్లు తీయడంతో 23వ స్థానం అందుకున్నాడు. గతంలో అతడి కెరీర్‌ బెస్ట్‌ 53 కావడం గమనార్హం.


రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకొనేందుకు సిద్ధమయ్యాడు. ముంబయి టెస్టులో 8 వికెట్లు తీసిన అతడు 883 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఒకటో ర్యాంకులో ఉన్న ప్యాట్‌ కమిన్స్‌ కన్నా కేవలం 43 రేటింగ్‌ పాయింట్లు తక్కువగా ఉన్నాడు. ఇక మహ్మద్ సిరాజ్‌ నాలుగు స్థానాలు మెరుగై 41వ ర్యాంకులో ఉన్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌-10లో ఉన్నాడు.


బ్యాటర్ల జాబితాలో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ 756 రేటింగ్‌తో ఆరు, రోహిత్‌ శర్మ 797తో ఐదో స్థానాల్లో ఉన్నారు. రిషభ్‌ పంత్‌ 13, చెతేశ్వర్‌ పుజారా 17లో కొనసాగుతున్నారు. అజింక్య రహానె 28కి పడిపోయాడు.


Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!


Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!


Also Read: Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్‌..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!


Also Read: Yuvraj Singh Comeback Rumor: యువరాజ్‌ సర్‌ప్రైజ్‌..! సెంకడ్‌ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్‌


Also Read: Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!


Also Read: Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి