ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటుదక్కించుకున్నారు. ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. వరుసగా మూడో ఏడాది కూడా నిర్మలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది నిర్మలా సీతారామన్ 37వ ర్యాంకు దక్కించుకున్నారు. 2020లో ఆమె 41వ స్థానంలో, 2019లో 34వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు. అమెరికా ఆర్థక మంత్రి జానెట్ యెల్లెన్ కంటే నిర్మలా రెండు స్థానాలు ముందున్నారు. జానెట్ యెల్లెన్ 39వ ర్యాంకు సాధించారు.
భారతీయులు..
నిర్మలా సీతారామన్‌తో పాటు మరికొంత మంది భారత మహిళలు ఈ జాబితాలో ఉన్నారు.
- హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ- రోషిణి నాడార్ మల్‌హోత్రా- 52వ ర్యాంకు
- బైకాన్ ఎక్స్‌గ్యూటివ్ ఛైర్‌పర్సన్- కిరణ్ మజుందర్ షా - 72వ ర్యాంకు
- నాయకా వ్యవస్థాపకురాలు - ఫల్గుణి నాయర్ - 88వ ర్యాంకు
ఫల్గుణి నాయర్ ఇటీవలే భారతదేశ ఏడవ మహిళా బిలియనీర్‌గా నిలిచారు. స్టాక్ మార్కెట్‌లో తన కంపెనీ అరంగేట్రం తర్వాత అత్యంత సంపన్నమైన బిలియనీర్‌గా మారారు.
టాప్- 5 వీరే..
- మెకెంజీ స్కాట్- అమెరికా నవలా రచయిత, ఫిలాంత్రపిస్ట్- మొదటి ర్యాంకు
- కమలా హారిస్- అమెరికా ఉపాధ్యక్షురాలు - 2వ ర్యాంకు
- క్రిస్టిన్ లగార్డ్- యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు హెడ్- 3వ ర్యాంకు
- మేరీ బర్రా- జనరల్ మోటార్స్ సీఈఓ- 4వ ర్యాంకు
- మెలిందా ఫ్రెంచ్ గేట్స్- ఫిలాంత్రపిస్ట్, బిజినెస్ ఉమెన్ - 5వ ర్యాంకు