అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది అంపైర్లు ఉన్నారు. కానీ ఎక్కువగా గుర్తుండిపోయింది మాత్రం బిల్లీ బౌడెనే! ఎందుకంటే ఆయన చూపించే సంకేతాలు మిగతావారితో పోలిస్తే భిన్నంగా ఉండేవి. అభిమానులను ఆకట్టుకునేవి.


సాధారణంగా బౌలర్లు వైడ్లు వేసినా బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లు దంచినా అంపైర్లు చేసే సిగ్నల్స్‌ ఒకే తరహాలో ఉంటాయి. కానీ బిల్లీ బౌడెన్‌ మాత్రం వారికి భిన్నం. బ్యాటర్లు బౌండరీలు బాదేస్తే అతడు వెరైటీగా చేతిని ఊపేవాడు. ఇక సిక్సర్లు బాదినప్పుడు రెండు వేళ్లను ముడిచి తీస్తూ ఒంటికాలిపై నిలబడి రెండు చేతుల్ని పైకి లేపేవాడు. అదొక ప్రత్యేకతను సంతరించుకొనేది.






బిల్లీ బౌడెన్‌ వీడ్కోలు పలికాక అలాంటి అంపైర్లను మనం చూడలేదు. స్థానిక క్రికెట్లో మాత్రం ఓ అంపైర్‌ వినూత్నంగా వైడ్‌ ఇచ్చి అలరించాడు. బిల్లీ బౌడెన్‌కు తానేమాత్రం తక్కువ కాను అంటున్నాడు. ఓ స్థానిక మ్యాచులో బౌలర్‌ వైడ్‌ వేశాడు. ఏమనిపించిందో ఏమో అంపైర్‌ భిన్నంగా ప్రవర్తించాడు. వికెట్ల నుంచి పక్కకు తిరిగి రెండు చేతులను కింద పెట్టి కాళ్లు పైకి ఎండగా చాపి వైడ్‌ ఇచ్చాడు.






ఈ సిగ్నల్స్‌ చూసిన ఆటగాళ్లు, అభిమానులు విస్తుపోయారు. పైగా మ్యాచుకు కామెంటరీ చేస్తున్న వ్యాఖ్యాతలు ఆశ్చర్యపోయి అతడి గురించి మాట్లాడారు. అయితే ఈ మ్యాచ్‌ ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. ప్రస్తుతం ఆ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. లక్షల మంది లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు.


Also Read: IND vs NZ Mumbai Test: టీమ్‌ఇండియా అతి పెద్ద విజయం.. కివీస్‌ అతి ఘోర పరాజయం!


Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!


Also Read: Rahul Dravid: కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి కారణం చెప్పిన రాహుల్‌ ద్రవిడ్‌!


Also Read: December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?


Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!


Also Read: India South Africa Tour: షాక్‌..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి