టీమ్‌ఇండియా క్రికెటర్లకు డిసెంబర్ 6కు ఓ అవినాభావ సంబంధం ఉంది! అదెలా అంటారా? ఎందుకంటే ఈ రోజు ఏకంగా ఐదుగురు క్రికెటర్లు బర్త్‌డే జరుపుకుంటున్నారు. అందరూ రికార్డుల వీరులే కావడం గమనార్హం. సీనియర పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, మాజీ పేసర్ ఆర్పీ సింగ్, త్రిశక వీరుడు కరుణ్ నాయర్ డిసెంబర్ 6నే జన్మించారు.
జస్ప్రీత్ బుమ్రా: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా 1993, డిసెంబర్ 6న జన్మించాడు. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 2016లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. మూడు ఫార్మాట్లలో 146 మ్యాచులాడి 275 వికెట్లు తీశాడు. 6/27 అత్యుత్తమ గణాంకాలు.
రవీంద్ర జడేజా: ఈ సీనియర్ ఆల్‌రౌండర్ 1988, డిసెంబర్ 6న జన్మించాడు. విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 క్రికెట్ ఆడాడు. నేడు 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మూడు ఫార్మాట్లలో 223 మ్యాచులాడి 4,862 పరుగులు చేశాడు. 30.13 ఎకానమీతో 466 వికెట్లు తీశాడు.
శ్రేయస్ అయ్యర్: ఈ యువ క్రికెటర్ 1994లో ముంబయిలో పుట్టాడు. నేడు 27వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 2017లో టీమ్‌ఇండియాలో అడుగు పెట్టాడు. మూడు ఫార్మాట్లలో 56 మ్యాచుల్లో 36.25 సగటుతో 1595 పరుగులు చేశాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే శతకం, అర్ధశతకం చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఆర్పీ సింగ్: ఈ మాజీ క్రికెటర్ 1985, డిసెంబర్ 6న జన్మించాడు. నేడు 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తనదైన స్వింగ్ బౌలింగ్‌లో ఆర్పీ అనేక విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్లలో 82 మ్యాచులు ఆడి 124 వికెట్లు తీశాడు. తనదైన రోజున ప్రత్యర్థిని వణికించేవాడు.
కరుణ్ నాయర్: టీమ్‌ఇండియాలో త్రిశతకం చేసిన రెండో ఆటగాడు కరుణ్ నాయర్. 1991, డిసెంబర్ 6న జన్మించాడు. అతనిప్పుడు 30వ వసంతంలోకి అడుగుపెట్టాడు. భారత్ తరఫున అతడు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడాడు. 374 పరుగులు చేశాడు. చాలినన్ని అవకాశాలు అతడికి దొరకలేదు.
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: ఫైనల్స్‌లో పీవీ సింధుకి చుక్కెదురు.. ఆమె చేతిలో వరుసగా మూడో ఓటమి!
Also Read: Ashes 2021-22: యాషెస్ మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
Also Read: India South Africa Tour: షాక్..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ!
Also Read: IND vs NZ 2nd Test: ముంబై టెస్టులో 372 పరుగులతో టీమిండియా ఘన విజయం.. కివీస్‌పై టెస్ట్ సిరీస్ కైవసం