ముంబయి టెస్టు విజయంతో టీమ్‌ఇండియా అరుదైన రికార్డు సాధించింది. మరోవైపు న్యూజిలాండ్‌ అత్యంత ఘోరమైన రికార్డు మూటగట్టుకొంది. ఇది భారత్‌ అత్యధిక పరుగుల తేడాతో సాధించిన విక్టరీ కాగా న్యూజిలాండ్‌కు పరుగుల పరంగా ఘోరమైన పరాజయం.


వాంఖడే వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమ్‌ఇండియా ఏకంగా 372 పరుగుల తేడాతో విజయం అందుకొంది. తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌ శతకం చేయడంతో 325 పరుగులు చేసింది. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను కేవలం 62 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఫాలో ఆన్‌ ఆడించకుండా నేరుగా బ్యాటింగ్‌కు దిగి రెండో ఇన్నింగ్స్‌లో 276/7కు డిక్లేర్‌ చేసింది. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కివీస్‌ను అశ్విన్‌ దెబ్బకొట్టాడు. దాంతో ప్రత్యర్థి కేవలం 167 పరుగులకే పరిమితం అయింది. భారత సంతతి స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం కివీస్‌కు ఊరట కలిగించే అంశం. 


భారత్‌: పరుగుల పరంగా అతిపెద్ద విజయాలు
372 vs న్యూజిలాండ్‌, ముంబయి 2021*
337 vs దక్షిణాఫ్రికా, దిల్లీ 2015
321 vs న్యూజిలాండ్‌, ఇండోర్‌ 2016
320 vs ఆస్ట్రేలియా, మొహాలి 2008


న్యూజిలాండ్‌: పరుగుల పరంగా ఘోరమైన పరాజయాలు
372 పరుగులు vs భారత్‌, ముంబయి 2021*
358 పరుగులు vs దక్షిణాఫ్రికా, జొహాన్స్‌బర్గ్‌ 2007
321 పరుగులు vs భారత్‌, ఇండోర్‌ 2016
299 పరుగులు vs పాక్‌, ఆక్లాండ్‌ 2001






Also Read:





href="https://telugu.abplive.com/sports/ind-vs-nz-2nd-test-mohammed-siraj-team-india-pacer-siraj-videos-goes-viral-12752" >Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?


Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్‌.. కిర్రాక్‌! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్‌!


Also Read: PV Sindhu: ఫైనల్స్‌లో పీవీ సింధుకి చుక్కెదురు.. ఆమె చేతిలో వరుసగా మూడో ఓటమి!


Also Read: Ashes 2021-22: యాషెస్ మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే.. కొత్త కెప్టెన్ ఎవరంటే?


Also Read: India South Africa Tour: షాక్‌..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ!


Also Read: IND vs NZ 2nd Test: ముంబై టెస్టులో 372 పరుగులతో టీమిండియా ఘన విజయం.. కివీస్‌పై టెస్ట్ సిరీస్ కైవసం