హమ్మయ్య..! స్టాక్ మార్కెట్లు మండే మండిపోతే మంగళవారం మాత్రం లాభాలు పంచిపెట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1000+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 300 పాయింట్ల వరకు ఎగియడంతో మదుపర్లు సంతోషంలో మునిగి తేలారు. సూచీలు భారీ స్థాయిలను అందుకోవడంతో ఈ ఒక్క రోజే రూ.3.3 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. రేపు ఆర్‌బీఐ సమీక్ష ఉండటం, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, సానుకూల సెంటిమెంటు ఇందుకు దోహదం చేశాయి.
ముదపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం రోజు ముగింపు 56,747తో పోలిస్తే నేడు 57,125 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో ఆరంభమైంది. అక్కడి నుంచి మదుపర్లు భారీగా కొనుగోళ్లు చేపట్టడంతో ఇంట్రాడేలో 57,905 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 1000 పాయింట్ల మేరకు ఎగిసిన సూచీ ఆ తర్వాత లాభాల స్వీకరణకు దిగడంతో 886 పాయింట్ల లాభంతో 57,633 వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపు 16,912తో పోలిస్తే మంగళవారం 17,044 వద్ద ఆరంభమైంది. అదే జోరుతో పైపైకి చేరుకుంది. 17,251 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ 264 పాయింట్ల లాభంతో 17,176 వద్ద ముగిసింది.
బ్యాంకు నిఫ్టీ సైతం 882 పాయింట్లు లాభపడింది. ఉదయం 36,086 వద్ద మొదలైన సూచీ 36,013 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత జోరందుకొని గరిష్ఠమైన 36,820ని తాకింది. చివరికి 36,618 వద్ద ముగిసింది.
నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ మూడు నుంచి ఐదు శాతం వరకు లాభపడ్డాయి. బ్రిటానియా, సిప్లా, దివిస్ ల్యాబ్, ఆసియన్ పెయింట్స్, ఐఓసీ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగా సూచీలూ కళకళలాడాయి. బ్యాంక్, మెటల్, రియాల్టీ 2-3 శాతం పెరిగాయి.
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది తెలుసా?
Also Read: LIC Insurance Premium: ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!
Also Read: GST Update: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గింపు.. ఎవ్వరూ అడగట్లేదన్న కేంద్రం!
Also Read: Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి