ఆరోగ్య బీమా ప్రీమియంపై వస్తు సేవల పన్ను తగ్గింపును పరిగణనలోకి తీసుకోవాలన్న సూచనలేమీ రాలేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కే కరాద్‌ అన్నారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్‌టీ విధించడంపై అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.


'జీఎస్‌టీ మండలి సూచనల ఆధారంగా పన్ను రేటును నిర్ణయిస్తారు. ఇది చట్టబద్ధమైన కమిటీ. కేంద్ర, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఉంటారు. ప్రస్తుతానికి ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీని తగ్గించాలన్న ప్రతిపాదనలేమీ జీఎస్‌టీ మండలికి రాలేదు' అని మంత్రి భగవత్‌ అన్నారు.


ఆరోగ్య బీమాను వాణిజ్య పరంగా విస్తరించడం బీమా సంస్థలు, వారి వ్యాపార అభివృద్ధి ప్రణాళికలపై ఆధారపడి ఉంటుందని మంత్రి తెలిపారు. వీటిని సంబంధిత నియంత్రణ సంస్థలు, బోర్డులు ఆమోదిస్తాయని పేర్కొన్నారు. బీమాను వాణిజ్యపరంగా విస్తరించినప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.


'ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. వారు సమయాన్ని బట్టి ఆరోగ్య రంగ సమస్యలపై జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ను ఆరంభించింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం. దీని కింద ఒక కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. దాదాపుగా 50 కోట్ల మంది లబ్ధిపొందొచ్చు' అని మంత్రి తెలిపారు.


Also Read: Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..


Also Read: Petrol-Diesel Price, 6 December: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో హెచ్చుతగ్గులు.. తాజా ధరలు ఇలా..


Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!


Also Read: WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?


Also Read: Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి