తల్లులు తమ పిల్లలకు రొమ్ము పాలివ్వడం మంచిదే. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే తల్లి తన బాధ్యతను నెరవేర్చవచ్చు. పిల్లలకు పాలిస్తే.. ఒకే. కానీ, ఓ మహిళ ఏకంగా తన పెంపుడు పిల్లికి తన రొమ్ము పాలిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా విమానంలో. ఈ షాకింగ్ ఘటన న్యూయార్క్- జార్జియాలోని అట్లాంటా గగనతలంలో చోటుచేసుకుంది. ఆమె చర్యపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విమానంలో పెద్ద రచ్చే జరిగింది.


మెరికాలోని న్యూయార్క్ నుంచి అట్లాంటాకు ప్రయాణికులతో బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలోని ఓ ప్రయాణికురాలు తన పెంపుడు పిల్లి పిల్లతో ప్రయాణిస్తోంది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఆమె తన షర్ట్ బటన్స్ విప్పి.. ఆ పిల్లికి రొమ్ము పాలు (చనుబాలు) తాగించింది. పక్కనే ఉన్న ప్యాసింజర్ ఇది చూసి వెంటనే ఫ్లైట్ అటెండర్‌కు ఈ విషయాన్ని చెప్పింది. 


విమాన సిబ్బంది.. వెంటనే ఆ పని ఆపాలని ఆమెను కోరారు. కానీ, ఆమె మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అది తన పిల్లలాంటిదని, పాలిస్తే తప్పేముందని వారితో వాదించింది. దీంతో సిబ్బంది.. అట్లాంటాలో ఉన్న డెల్టా కార్యాలయంలోని రిపోర్టింగ్ సిస్టమ్ (ACARS) సమాచారం అందించారు. ‘‘సీట్ నెంబర్ 13Aలో ఓ ప్రయాణికురాలు ఓ పిల్లికి చనుబాలు ఇస్తోంది. ఫ్లైట్ అటెండెంట్ రిక్వెస్ట్ చేసినా ఆమె తన పిల్లిని మళ్లీ క్యారియర్‌లో పెట్టమంటే పెట్టడం లేదు’’ అనే మెసేజును పంపారు. విమానం ల్యాండైన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకోవాలని డెల్టా రెడ్ కోట్ టీమ్‌ను కోరారు. ప్రస్తుతం ఈ మెసేజ్‌కు చెందిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 




డెల్టా రెడ్ కోట్ టీమ్ అనేది విమానంలో ప్రయాణికుల సమస్యలను హ్యాండిల్ చేయడం కోసమే ఈ టీమ్ పనిచేస్తుందని వారి సంబంధిత వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఆ ఫ్లైట్ అటెండెంట్ అనిస్లే ఎలిజిబెత్ ‘టిక్ టాక్’లో ఈ ఘటన గురించి వివరించడంతో మరింత వైరల్ అయ్యింది. ‘‘ఆ మహిళ బొచ్చులేని పిల్లిని చిన్న పిల్లాడిలా కనిపించేందుకు బ్లాకెట్‌లో చుట్టి ఉంచింది. తన షర్ట్ బటన్స్ విప్పి రొమ్ము పాలు ఇచ్చింది. తిరిగి క్యారియర్‌లో పెట్టమంటే.. ఆమె అంగీకరించలేదు. ఆ క్యాట్ బిగ్గరగా అరవడంతో ప్రయాణికులు షాకయ్యారు’’ అని తెలిపింది. అయితే, అట్లాంటాలో విమానం ల్యాండైన తర్వాత సెక్యూరిటీ సిబ్బందిని ఆమెను అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పేర్కొంది. 


Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు


ఈ ఘటనపై డెల్టా సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా స్పందిస్తూ.. ‘‘మా డెల్టా విమానాల్లో ఆమె చనుబాలు ఇచ్చేందుకు ఆమెకు హక్కు ఉంది. ఆమెకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం’’ అని ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే.. ఆమెకు ఎలాంటి శిక్ష విధించలేదని అర్థమవుతుంది. కొన్ని విమాన సంస్థలు పెంపుడు జంతువులను విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతించవు. వాటి వల్ల తోటి ప్రయాణికులకు హాని కలుగుతుందనే ముందు జాగ్రత్తతో అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వాటి కోసం విమానాల్లో ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. అయితే, డెల్టా సంస్థ మాత్రం వెంటిలేషన్ ఉండే క్యారియర్‌లలో చిన్న సైజు పిల్లి పిల్లలు, కుక్క పిల్లలను తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తుంది. 


Read also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం


 Read also:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి