మోసపోయే వాళ్లు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్లు వివిధ రూపాల్లో వస్తూనే ఉంటారు. దానికి ఉదాహరణే గుంతకల్‌లో జరగిని ఓ బ్లాక్ కరెన్సీ మోసం. ప్రాథమిక దశలోనే వాటికి పోలీసులు అడ్డుకట్ట వేయడంతో బాధితుల సంఖ్య తగ్గింది. లేకుంటే చాలా మంది ఈ దందాతో మోసపోయేవాళ్లు.
చదివిందోమో డిఫార్మసీ... అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా జీవితం మొదలపెట్టాడో వ్యక్తి. జల్సాలకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. తీర్చే దారి తెలియక.. మోసాల దారిని ఎంచుకున్నాడు దాసరి నరేష్ కుమార్. అగ్రిగోల్డ్ తర‌్వాత రైస్ పుల్లింగ్ ముఠాలతో పరిచయం పెంచుకొని అడ్డదార్లు తొక్కాడు. అక్రమంగా డబ్బు సంపాదనకు అలవాటు పడ్డాడు. రైస్ పుల్లింగ్‌తో ఆశించిన డబ్బు సంపాదించలేకపోయాడు. ఏం చేస్తే ఈజీగా డబ్బులు వస్తాయో అని ఆలోచించి బ్లాక్ కరెన్సీ తయారీకి సిద్ధమయ్యాడు. ఇందు కోసం మరో ఇద్దరితో కలిసి బ్లాక్ కరెన్సీ మోసాలకు పాల్పడుతూ సంపాదనకు తెరలేపాడు.
బ్లాక్ పేపర్లను నోట్ల సైజులో కట్ చేసి బ్లాక్ కరెన్సీ సిద్ధం చేస్తాడు. ఈ నోట్ల కట్లలపై భాగంలో కెమికల్స్ పూసేవాడు. ఆ నోట్ల కట్ట పైభాగంలో ఒరిజినల్ నోట్ ఉంచేవాడు. కస్టమర్లు వస్తే ఆ నోట్‌ను కెమికల్స్ పూసి ఇదిగో ఒరిజినల్ నోట్ రెడీ అంటూ ఖహానీలు చెప్పేవాడు. ఈ బ్లాక్ కరెన్సీ గోవాలోని ఆర్బీఐ ముద్రించే ప్యాక్టరీ నుంచి తెచ్చామని నమ్మించేవాడు. ఒక ఒరిజనల్ నోటుకు నాలుగు బ్లాక్ కరెన్సీ నోట్లు ఇచ్చేవాడు.
అయితే ఈ మోసం అంత ఈజీగా దాగేది కాదు కనుక ఆ నోటా ఈనోటా పోలీసుల చెవిన పడింది. బాధితులు మోసపోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా జంకారు. కానీ ఒకరు మాత్రం ధైర్యంగా పోలీసులకు చెప్పడంతో నిందితుల ఆటకట్టించారు పోలీసులు. ప్రధాన సూత్రధారి నరేష్ కుమార్‌ను అతనికి సహకరించిన దొరస్వామిరెడ్డి(61), పులుసు గోపాలకృష్ణా(32)ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 380000/-స్వాదీనం చేసుకొన్నారు. 28బ్లాక్ పేపర్ల కట్టలు,కెమికల్ పూతగా పూసి బ్లాక్ గా మార్చిన 500నోట్లను,కెమికల్స్ ను స్వాధీనం చేసుకొన్నట్లు గుంతకల్ డీఎస్పీనరసింగప్ప వెల్లడించారు.