ఈ నెల 9న.. తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఈ ఏడాది కృష్ణా జలాల విడుదలపై..  సమావేశంలో చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల్లో సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చ జరగనుంది.    బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆన్ లైన్ వేదికగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. 


తెలుగు రాష్ట్రాల్లో నీటి అవసరాల దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి జలాశయాలైన.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఈ భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చ జరగనుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా.. ఆదేశాలు జారీ చేస్తారు.


ఈ ఏడాది సరైన వర్షాలు పడి.. కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అయితే నీరు ఉన్న కారణంగా.. రెండు రాష్ట్రాలు అవసరమైన నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు తెలిపింది. వరద ప్రవాహం తగ్గినాక.. ఏ రాష్ట్రం ఎంత వినియోగించిందో.. నీటి లెక్కలు తేలుస్తామని వెల్లడించింది. ఆ తర్వాతనే అవసరాలకు అనుగుణంగా.. కేటాయిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో గత నెల 31 వరకు వాడుకున్న లెక్కలు, 2022 మార్చి 31 వరకు సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించిన లెక్కలు చెప్పాలని ఇప్పటికే.. రాష్ట్రాలను బోర్డు కోరింది. ఇప్పటిదాకా వినియోగించుకున్న నీరు ఆధారంగా, నీటి లభ్యత ఆధారంగా.. మిగిలిన వాటా జలాల కేటాయింపు జరగనుంది.


Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి