ముంబయి టెస్టు విజయంపై టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. జట్టంతా అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. సీనియర్లు లేని లోటును కుర్రాళ్లు తీర్చారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌పై ఫాలోఆన్‌ విధించకపోవడానికి, త్వరగా డిక్లేర్‌ చేయకపోవడానికి కారణాలు వివరించాడు. ఎర్రమట్టితో తయారు చేసిన పిచ్‌లపై కఠిన సందర్భాల్లో ఆడటం నేర్పించేందుకే ఇలా చేసినట్లు స్పష్టం చేశాడు. మ్యాచ్‌ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు.


'విజయంతో ముగించినందుకు సంతోషంగా ఉంది. కాన్పూర్‌లో మేం విజయాన్ని సమీపించాం. ఒక వికెట్‌ దగ్గర ఆగిపోయాం. కఠిన పరిస్థితుల్లో పుంజుకున్నందుకు అభినందనలు. తొలిటెస్టు గెలవనందుకు కాస్త నిరాశగా అనిపించింది. కుర్రాళ్లు అవకాశాలు అందిపుచ్చుకోవడం సంతోషం. మేం కొందరు సీనియర్లను మిస్సయ్యాం. కానీ కుర్రాళ్లు మాత్రం చెలరేగారు. జయంత్‌ యాదవ్ నిన్న ఇబ్బంది పడ్డాడు. ఈ రోజు మాత్రం రెచ్చిపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌, మయాంక్‌ అగర్వాల్‌, అక్షర్ పటేల్‌, జయంత్‌ రాణించారు. సీనియర్లు రాగానే మాకు మరిన్ని ఆప్షన్లు దొరుకుతాయి' అని ద్రవిడ్‌ అన్నాడు.






'మేం డిక్లరేషన్‌ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే చాలా సమయం మిగిలేఉంది. పైగా కుర్రాళ్లకు కఠిన పరిస్థితుల్లో ఆడే అవకాశం ఇవ్వాలి. ఎర్రమట్టి వికెట్లు, భిన్నమైన బౌన్స్‌, పరిస్థితుల్లో ఆడితే వారికి అనుభవం వస్తుంది. మేం ప్రత్యర్థిని ఆలౌట్‌ చేస్తామని తెలుసు. ఆటగాళ్లు గాయాల పాలవ్వడం బాధాకరం. ఎందుకంటే వారు వేర్వేరు ఫార్మాట్లలో ఎక్కువ క్రికెట్‌ ఆడుతున్నారు. వారి పనిభారాన్నీ పర్యవేక్షించాలి. మున్ముందు మరింత క్రికెట్‌ ఆడాల్సి ఉంది. జట్టులో చోటు కోసం అంతా కష్టపడుతున్నారు. ఇదో తీయని తలనొప్పే' అని మిస్టర్‌ వాల్‌ పేర్కొన్నాడు.


Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్‌.. కిర్రాక్‌! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్‌!






Also Read: PV Sindhu: ఫైనల్స్‌లో పీవీ సింధుకి చుక్కెదురు.. ఆమె చేతిలో వరుసగా మూడో ఓటమి!


Also Read: Ashes 2021-22: యాషెస్ మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే.. కొత్త కెప్టెన్ ఎవరంటే?


Also Read: India South Africa Tour: షాక్‌..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ!


Also Read: IND vs NZ 2nd Test: ముంబై టెస్టులో 372 పరుగులతో టీమిండియా ఘన విజయం.. కివీస్‌పై టెస్ట్ సిరీస్ కైవసం