స్కూల్‌కు సెలవు కావాలి..!. ఓ క్రిమినల్ మైండ్ ఉన్న విద్యార్థి ఏం చేస్తాడు ! సినిమాల్లోనో.. సీరియల్స్‌లోనే చూపించే ఓ క్రిమినల్ పనిని చేసి.. సెలవు కోసం ప్రయత్నిస్తాడు. కానీ సులువుగానే దొరికిపోతాడు. ఆ ఒడిషా  విద్యార్థి కూడా దొరికిపోయాడు. ఎం చేశాడంటే స్కూల్‌కు సెలవులు ఇవ్వడం లేదని .. తోటి విద్యార్థులు తాగే నీళ్లలో విషం కలిపేశాడు. 


Also Read : ఆర్‌ఎంపీ ప్రాక్టీసనర్‌... పాలిక్లీనిక్‌ ఓనర్... కథ అక్కడే అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు
  
ఒడిశాలోని బర్‌గార్‌ జిల్లాకు చెందిన కామగాన్‌ హయ్యర్ సెకండరీ స్కూల్‌ ఉంది. అందులో 11వ తరగతి చదివే ఓ విద్యార్థి స్కూల్‌కు సెలవులు ఇస్తారని బాగా ఆశపడ్డాడు. పాఠశాలలోని హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్ధి ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లు వచ్చినప్పుడు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఒమిక్రాన్‌ వల్ల కూడా స్కూళ్లు మూతపడి సెలవులిస్తారని అనుకున్నాడు. 


Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


అలా జరగలేదు. దీంతో ఎలాగైనా సెలవులు కావాలన్న ఉద్దేశంతో క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించాడు. తనతో పాటు తన స్నేహితులు అందరూ ఓ బాటిల్‌లోనే నీళ్లు తాగుతూంటారు. ఆ  బాటిల్‌లో విషం కలిపితే సెలవులు వస్తాయని లెక్కలేసుకున్నాడు. స్కూల్ తోటలో వాడే పురుగుల ముందు బాటిల్ కనబడటంతో దాన్నే తన ప్లన్ అమలు చేయడానికి వాడుకున్నాడు. బాటిల్‌లో విషయం కలిపి నీళ్లను తన స్నేహితులకు ఇచ్చాడు. వారు తాగారు .. కానీ తను మాత్రం ముట్టుకోలేదు.  ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. వాటర్ పాయిజనింగ్ అయిందని వైద్యులు గుర్తించారు. ఎలా అయిందాఅని స్కూల్ వర్గాలు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. 


Also Read: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి


సరైనసమయంలో చికిత్స అందించడంతో విద్యార్థులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఐతే విద్యార్ధి కెరీర్‌, చిన్న వయసును దృష్టిలో ఉంచుకుని టీసీ ఇచ్చి పంపేశారు. ఈ ఘటన ఒడిషాలో సంచలనం సృష్టించింది. 


Also Read:Crime News: చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ ఎఫైర్.. భర్త వెళ్లగానే ఇంట్లోకి వచ్చేవాడు.. విషయం బయటకు తెలిసి.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి