భారతదేశంలో పాసింజర్ వాహనాల హోల్‌సేల్స్ నవంబర్‌లో 19 శాతం వరకు పడిపోయాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడిందని, ఇది డీలర్స్ డెలివరీపై కూడా పడింది. కాబట్టి సేల్స్ మందగించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చర్ తెలిపింది.


ఆటో ఇండస్ట్రీ బాడీ ప్రకటన ప్రకారం.. గత నెలలో ప్యాసింజర్ వాహనాల సేల్స్ 2,15,626 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో 2,64,898 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే మొత్తంగా 19 శాతం తగ్గిందన్న మాట. అదేవిధంగా, మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు గత నెలలో 16,00,379 యూనిట్ల నుంచి 34 శాతం తగ్గి 10,50,616 యూనిట్లకు తగ్గాయి.


మొత్తం త్రీ-వీలర్ డిస్పాచ్‌లు 22,471 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో ఈ సంఖ్య 24,071 యూనిట్లుగా ఉంది. ఇవి కూడా 7 శాతం మేర తగ్గాయి. కేటగిరీల వారీగా చూస్తే మొత్తం ఆటోమొబైల్ విక్రయాలు గత నెలలో 18,89,348 యూనిట్ల నుంచి 12,88,759 యూనిట్లకు పడిపోయాయి.


“గ్లోబల్ సెమీ కండక్టర్ షార్టేజ్ కారణంగా పరిశ్రమ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పండుగల సీజన్‌లో, నష్టపోయిన సేల్స్‌ను భర్తీ చేయాలని పరిశ్రమ భావిస్తోంది. అయితే 2021 నవంబర్‌లో విక్రయాలు భారీగా పడిపోయాయి. నవంబర్ విక్రయాలు ప్రయాణీకుల వాహనాలకు ఏడేళ్లలో అత్యల్పంగా, ద్విచక్ర వాహనాలకు 11 ఏళ్లలో అత్యల్పంగా, త్రీ వీలర్స్‌కు 19 సంవత్సరాల్లో అత్యల్పంగా నమోదయ్యాయి.” అని SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నందున ఉద్యోగుల భద్రత, సప్లై చైన్ సమస్యల విషయాలను ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి