బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో షో ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీరామ్ ఇప్పటికే టాప్ 5లోకి చేరుకోవడంతో మిగిలిన ఐదుగురు సభ్యులు మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, కాజల్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అందరికంటే కాజల్ కి తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. 

 

ఓటింగ్ లో అందరికంటే ముందు సన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా సన్నీ తన ఎంటెర్టైన్మెంట్ కంటెంట్ బాగా పెంచాడు. తన గెటప్స్, డైలాగ్స్ తో అందరినీ నవ్విస్తూనే ఉన్నాడు. అలా అని తన గేమ్ ని పక్కన పెట్టలేదు. గేమ్ ఆడుతూనే కామెడీ చేస్తున్నాడు. ఈ వారం కూడా అందరికంటే సన్నీకి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మానస్ కి కూడా ఓట్లు బాగానే పడుతున్నాయట. హౌస్ లో మెచూర్డ్ అబ్బాయిగా పేరు తెచ్చుకున్నాడు మానస్. అనవసరమైన గొడవలకు పోకుండా.. తన పాయింట్ ని కరెక్ట్ గా చెబుతూ.. గేమ్ చాలా సీరియస్ గా ఆడుతున్నాడు మానస్. 

 

ఇక కాజల్ గ్రాఫ్ ఈ వారం బాగా పడిపోయిందని తెలుస్తోంది. నిజానికి మూడు వారాలుగా ఆమెకి ఓట్లు భారీగా పడడంతో ప్రతీవారం సేవ్ అవుతూ వచ్చింది. కానీ ఈ వారం మాత్రం ఆమె డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. శ్రీరామ్ తో గొడవ, ఇతర అంశాల కారణంగా ఆమెకి ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. సిరి, షణ్ముఖ్ లు కొన్ని రోజులుగా తమ బిహేవియర్ తో ఆడియన్స్ ను విసిగిస్తున్నప్పటికీ.. యూత్ లో షణ్ముఖ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఇద్దరికీ కలిపి ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఈ వారం కూడా వీరిద్దరూ సేవ్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఈ వారం కాజల్ ఎలిమినేట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. టాప్ 5 లో ఉండాలనేది కాజల్ కల. ఒకవేళ బిగ్ బాస్ లెక్కలు మారిస్తే మాత్రం కాజల్ సేవ్ అయ్యి సిరి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.