సంప్రదాయ వాదులు అస్సలు అంగీకరించని రియాల్టీ షో స్ లో   'బిగ్ బాస్' ఒకటి. ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. ఈ సారి ఆ పనిలో బిజీగా ఉన్న బ్యూటీ ఎవరంటే మాధవీ లత అని ఠక్కున చెబుతారు. సీజన్ 5 ప్రారంభమైనప్పటి నుంచీ షో జరుగుతున్న తీరు, అందులో కంటెస్టెంట్స్ ప్రవర్తనపై తగిన కారణాలు చూపిస్తూ విరుచుకుపడుతూనే ఉంది. ఆ మధ్య సిరి హన్మంత్‌ వాష్‌రూంలో తల బాదుకోవడాన్ని తప్పుపడుతూ  బిగ్‌బాస్‌కు 100 కోట్ల జరిమానా వేయిస్తానన్న మాధవీ లత... సన్నీని మానసికంగా చంపేస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి సిరి-షణ్ముఖ్‌ తీరుపై దుమ్మెత్తిపోసింది. 
Also Read: ఓడియమ్మ.. బ్రహ్మకే దిమ్మతిరిగేలా చేస్తున్న సిరి గేమ్ ప్లాన్.. ఇదే జరిగితే షన్ను ఔట్?
రీసెంట్ ఎపిసోడ్స్ లో షణ్ముఖ్‌  పదే పదే సిరిపై ఫైరవుతున్నాడు.  హగ్గు గురించి సిరి తల్లి మాట్లాడిన మాటల్ని ప్రతిసారీ ప్రస్తావిస్తూ నసపెడుతున్నాడని ప్రేక్షకులు కూడా చికాకుగా ఫీలవుతున్నారు.   కంటి చూపులతో ఆమెను కంట్రోల్‌ చేస్తున్నాడని, ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంటే ఆపాలో వద్దో అర్థంకాక ఇంటి సభ్యులు కూడా చర్చించుకుంటున్నారు.  ‘అవతలి వాళ్లను ఆయన ఈయన అంటావు, నన్నేమో అరేయ్‌ ఒరేయ్‌ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు. మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు  అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్‌ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్‌ ఒక్కటే గుర్తుంది..' అంటూ సిరిపై పెద్ద పెద్ద అరుపులు అరిచేశాడు. ఏమీ మాట్లాడలేక సిరి మళ్లీ క్షమించమని అడుగుతూ హగ్ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై రియాక్టైన మాధవీలత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 
Also Read: ఫేవరేట్ స్టార్స్‌‌లా మారిపోయిన హౌస్ మేట్స్... డ్యాన్సులతో దద్ధరిల్లిపోయిన బిగ్‌బాస్ హౌస్, ఈ ఎపిసోడ్ చూడాల్సిందే



``ఏమయ్యా బిగ్ బాస్ .. ఏందయ్యా ఇది. ఆడ పిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగ కూడదు.. అంటూ ఓ ఆడపిల్లను మానసిక అత్యాచారం చేస్తున్నారు. వీకెండ్ లో నాగ్ మావ వచ్చి వగలు పోతారు. చివరికి నాగార్జునని కూడా టీఆర్పీ కోసం దిగజార్చేస్తున్నారు. ఒక కన్న తల్లి మాటకి విలువ లేకుండా చేస్తున్నారు. సభ్య సమాజానికి బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? హగ్గులు ఇచ్చేస్తున్న వాడికే కప్ తగలబెట్టడండి. అలాంటి వాడికే బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. ఇలాంటి వాడికి కిరీటం ఇస్తే బీబీ కొంప మీద ఫైర్ యాక్సిడెంట్ అయి సెట్ తగలబడిపోవడం ఖాయం. హగ్గులు,కిస్సులు,పక్కోడి పెళ్లాన్ని వాటేసుకోవడం, స్నేహం ముసుగులో కామకలాపాలు చూడలేకపోతున్నాం. బీబీ చివరి ఎపిసోడ్ చూసి మీనిర్ణయం సమాజానికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే షో పై డైరెక్ట్ గా గా సుప్రీం కోర్టులో కేసు వేస్తా. హైకోర్టుల కూడా ఓ పిల్ పడేస్తాను. ఇది జోక్ కాదు. చాలా సీరియస్. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అన్ని అవమనాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలసి చూడలేని పరిస్థితి. అడల్ట్ షో చూస్తున్నామా? అన్న ఫీలింగ్ కలుగుతోంది. `బిగ్ బాస్ -5` వరస్ట్ షో`` అంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత.  




 బిగ్ బాస్ రియాల్టీ షోపై విమర్శలు రావడం ఇదేం మొదలు కాదు. గతంలోనూ చాలా విమర్శలొచ్చాయి. అయితే నెగెటివ్ కామెంట్స్ కూడా షోకి ప్లస్ అవుతాయంటూ తమపని తాము చేసుకుపోతున్నారు నిర్వహకులు. కొందరైతే ఇంతలా దుమ్మెత్తిపోసే బదులు చూడడం మానేస్తే పోలా అంటున్నారు. మరోవైపు  సీజన్ 5 కి శుభం కార్జు పడడానికి టైం దగ్గరపడింది. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో వెయిట్ అండ్ సీ..
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Also Read: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం.. డాక్టర్ బాబు , వంటలక్కకి రుద్రాణి నుంచి కొత్త కష్టాలు..
Also Read: 'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి