అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌ను రూ.999కే పొందడానికి నేడే(డిసెంబర్ 12వ తేదీ) ఆఖరి రోజు. డిసెంబర్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వార్షిక మెంబర్ షిప్ ధర రూ.1,499కు పెరగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఈ అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఉచితంగా సినిమాలను, మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసే అవకాశం కల్పిస్తుంది.
దీంతోపాటు అమెజాన్ షాపింగ్ పోర్టల్‌లో ప్రయారిటీ షాపింగ్, ఫ్రీ డెలివరీ వంటి ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. ఈ కొత్త అమెజాన్ ప్రైమ్ ధరలు నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్లు అన్నిటికీ పెరిగాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ నెలవారీ సభ్యత్వం రూ.129 నుంచి రూ.179కి పెరిగింది.
మూడు నెలల ప్లాన్ రూ.329 నుంచి రూ.459కి పెరగనుంది. ఇక వార్షిక ప్లాన్ ధర రూ.999 నుంచి రూ.1,499కు పెరగనుంది. డిసెంబర్ 13వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌కు స్ట్రీమింగ్ సర్వీసుల విషయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి, ఈ-కామర్స్ విషయంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి గట్టి పోటీ ఉంది.
గత ఐదు సంవత్సరాల నుంచి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పెంచలేదు. అయితే ఇప్పుడు ఈ పెంపునకు కారణాలు అమెజాన్ తెలపలేదు. కరోనా వైరస్ ప్యాండమిక్ సమయంలో అన్ని భాషలకు సంబంధించిన కొన్ని పెద్ద చిత్రాలను అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు.
వీటిలో వి, టక్ జగదీష్, నారప్ప, దృశ్యం 2, పెంగ్విన్, నిశ్శబ్దం వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక సూర్య నటించిన సురారై పొట్రు(ఆకాశం నీ హద్దురా), జైభీమ్ సినిమాలు ప్రైమ్‌కు పెద్ద ప్లస్ అయ్యాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ప్రైమ్‌లో నేరుగా విడుదల అయ్యాయి.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!