విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దీక్షకు దిగారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ దీక్ష చేపట్టారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఈ దీక్ష చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 300 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. కార్మికులకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకు పవన్‌ కల్యాణ్ ఈ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. 






Also Read: చంద్రబాబు చూడాల్సింది అఖండ మూవీ కాదు జస్టిస్ చంద్రు వీడియో... ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడే హోదా కనుమరుగు






అమరావతి ముగింపు సభకు పవన్..


గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో పవన్‌ కల్యాణ్ శ్రమదానం చేశారు. వడ్డేశ్వరంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై శ్రమదానం చేశారు. పారపట్టి కంకరతో గుంతలు పూడ్చారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితికి నిరసన తెలుపుతూ పవన్‌ ఈ కార్యక్రమం చేపట్టారు. ఆ తరువాత జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా దీక్ష చేపట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్‌ చేశారు. ఇటీవల ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులు అర్పించారు. విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. పవన్ కల్యాణ్ ను రాజధాని పరిరక్షణ సమితి ప్రతినిధులు, మహిళా రైతులు కలిశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని పవన్ వారితో అన్నారు. రైతుల మహా పాదయాత్ర, తమ ఇబ్బందులను మహిళా రైతులు పవన్ కు తెలిపారు. తిరుపతి రైతుల సభకు రావాలని పవన్ ను ఆహ్వానించారు రైతులు. ఆ సభకు వస్తాయని పవన్ హామీ ఇచ్చారు.  






Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి