తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,110 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,210 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,110 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,210గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,110 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,210గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,510గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780గా ఉంది.


ప్లాటినం ధర నేడు స్థిరంగా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,910 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Broadband Tariff Update: టెలికాం బాటలో బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు.. త్వరలోనే ఇంటర్నెట్‌ ధరల పెంపు?


Also Read: Interest Rate Cut: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?


Also Read: Passenger Vehicle Sales: భారీగా పడిపోయిన వాహనాల సేల్స్.. కారణం అదే.. ఇలా అయితే సమస్యలు తప్పవు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి