బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లకు షాకిచ్చే వార్త!! ఎందుకంటే మున్ముందు బ్రాడ్‌బ్యాండ్‌ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత కంపెనీలు 15-20 శాతం వరకు ధరలను సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వ్యాపారాలు కొనసాగాలంటే టారిఫ్‌లు పెంచక తప్పదని కొందరు పేర్కొంటున్నారు.


టెలికాం టారిఫ్‌ ధరలను ఈ మధ్య పెంచిన సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, జియో కంపెనీలు ప్రీపెయిడ్‌ ప్లాన్లపై 20 శాతం వరకు ధరలు పెంచాయి. బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలూ ఇప్పుడు అదే బాటలో పయనించనున్నాయి.


'టెలికాం తరహాలోనే బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీల ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ ఏఆర్‌పీయూ (ఒక వినియోగదారుడిపై సగటు రాబడి) సవరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వినియోగదారులను ఆకట్టుకొనే యుద్ధంలో సర్వీస్‌ ప్రొవైడర్లు ఇప్పటికే నష్టపోయారు! సేవలు అందించాలంటే కనీసం 15-20 శాతం ధరలను పెంచాలి' అని మేఘ్‌బెలా బ్రాడ్‌బ్యాండ్‌ సహ వ్యవస్థాపకుడు తపబ్రత ముఖర్జీ అన్నారు.


ఇప్పుడు మార్కెట్‌ ట్రెండ్‌ను అనుసరించి ఓటీటీ స్ట్రీమింగ్‌ సేవలనూ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అందిస్తున్నారు. వీటి భారమూ వారిపై ఎక్కువగానే ఉందని ముఖర్జీ పేర్కొన్నారు. అయితే ఎయిర్‌టెల్‌, జియో వంటి జాతీయ టెలికాం సంస్థలూ బ్రాడ్‌బ్యాండ్‌ ధరలు సవరించాలని లేదంటే చిన్న కంపెనీలు ఇబ్బందుల పడతాయని అంటున్నారు. ఇప్పటికైతే వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.


Also Read: International Commercial Flights: అంతర్జాతీయ విమాన సేవలపై కీలక ప్రకటన.. ఒమిక్రాన్ వ్యాప్తి వల్లే నిర్ణయం


Also Read: Social Media: భార్యను ట్రోల్‌ చేశారని.. బ్లాక్‌చైన్‌తో సొంత సోషల్‌ మీడియా!


Also Read: Passenger Vehicle Sales: భారీగా పడిపోయిన వాహనాల సేల్స్.. కారణం అదే.. ఇలా అయితే సమస్యలు తప్పవు!


Also Read: Petrol-Diesel Price, 12 December: వాహనదారులకు స్వల్ప ఊరట.. స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరంలో భారీ పెరుగుదల


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్.. రూ.140 పెరిగిన ధర, ఎగబాకిన వెండి రేటు


Also Read: Aadhaar Card News: ఆధార్‌ కార్డులో అడ్రెస్, పేరు, పుట్టిన తేదీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?


Also Read: Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!


Also Read: Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం


Also Read: Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!


Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!