అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడో ధాటికి 80 మంది వరకు మృతి చెందారు. అమెరికా చరిత్రలో ఇదే అతి పెద్ద విపత్తని అధ్యక్షుడు జో బైెడెన్ అన్నారు.
కెంటకీలో..
అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి కెంటకీ రాష్ట్రంలోనే వేర్వేరు ఘటనల్లో సుమారు 70 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషియర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
కొవ్వొత్తుల తయారీ కర్మాగారం పైకప్పు కుప్పకూలటం వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఆయన అన్నారు. ఆ సమయంలో 110 మంది ఆ కర్మాగారంలో ఉన్నట్లు వెల్లడించారు. సహాయక చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు గవర్నల్ పేర్కొన్నారు.
భారీగా ఆస్తి నష్టం..
కెంటకీలోని బౌలింగ్ గ్రీన్ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. టోర్నడో ప్రభావం ఆరు రాష్ట్రాలపై పడింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read: Viral Video India 2021: 'ఏం చేస్తిరి ఏం చేస్తిరి.. దుమ్మురేపారు కదరా'.. ఈ ఏడాది ఇవే తోపు వీడియోలు!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,774 మందికి కరోనా.. 560 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Also Read: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి