Manchu Vishnu: రాజీనామాలు, 'మా' బిల్డింగ్ పై మంచు విష్ణు రెస్పాన్స్ ఇదే..

'మా' బిల్డింగ్ కి సంబంధించిన ప్రకటనను మరో వారం రోజుల్లో విడుదల చేస్తామని మంచి విష్ణు చెప్పారు. 

Continues below advertisement

ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'మా' సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ - ''మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మెడికవర్ వాళ్ళు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను'' అని అన్నారు.

Continues below advertisement

వారం రోజుల్లో ప్రకటన..: మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. 'మా' కమిటీ మీటింగ్ జరిగింది. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తాం.
 
రాజీనామాలు ఆమోదం..: ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేసారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాను. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగింది. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు 'మా' సభ్యులుగా కొనసాగుతారు. నాగబాబు, ప్రకాష్ రాజు కూడా 'మా' సభ్యులుగా కొనసాగుతారు.

రఘుబాబు - 'మా' జనరల్ సెక్రటరీ..: హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. దానిని ఫస్ట్ ప్రయార్టీగా తీసుకుని, సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు 'మా' ప్రెసిడెంట్ విష్ణు. ముందుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విష్ణు ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా జరుగుతాయి.
 
శివబాలాజీ - 'మా' ట్రెజరర్..: హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ. మా సభ్యులు అందరూ దీనిని ఉపయోగించుకోవాలి. 'మా' సభ్యుల హెల్త్ కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో 'మా' ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ అయ్యారు.
 
మాదాల రవి - 'మా' వైస్ ప్రెసిడెంట్..: మా సభ్యుల ఆరోగ్యం ముఖ్యం. సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పటల్ కి కృతజ్ఞతలు. చాలా హాస్పటల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి మెడికవర్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
 

Also Read: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో

Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?

Also Read: ఈసారి ‘గాలివాన’తో వస్తున్న జీ5.. ఓటీటీ లవర్స్‌కు గుడ్‌న్యూస్!

Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?

Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కవల పిల్లలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Continues below advertisement
Sponsored Links by Taboola