ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి, టాలీవుడ్‌కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలకు సంబంధించి డేవిడ్ భాయ్ చేసిన టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపడంతో పాటు ఎంతో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే డేవిడ్ వార్నర్ హైదరాబాద్ ఫ్రాంచైజీని వీడటంతో ఇక వార్నర్ తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియోలు చేయడేమోనని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ పుష్పలో సూపర్ హిట్ అయిన ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ పాటకు సంబంధించి డేవిడ్ వార్నర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.
ఫేస్ యాప్ సాయంతో అల్లు అర్జున్ బదులు డేవిడ్ వార్నర్ ఫేస్ ఉన్న వీడియోను వార్నర్ పోస్ట్ చేయగా.. దాని కింద విరాట్ ‘మిత్రమా.. బానే ఉన్నావా?’ అని కామెంట్ చేశాడు. పక్కన పగలబడి నవ్వుతున్న ఎమోజీ కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఆ వీడియోతో పాటు ఈ కామెంట్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
డేవిడ్ వార్నర్‌ను మెగా ఆక్షన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వార్నర్ పునీత్ రాజ్‌కుమార్ వీడియోను టిక్ టాక్ చేయడంతో పాటు ఇప్పుడు పెట్టిన వీడియోకు విరాట్ కామెంట్ చేయడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది.
అసలు వార్నర్ మెగా ఆక్షన్ వరకు వస్తాడా? వస్తే ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుంది? వంటి విషయాలకు మరో నెలరోజుల్లోనే సమాధానం దక్కనుంది.
Also Read: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!
Also Read: ICC Test Rankings: మయాంక్ దూకుడు..! 10 వికెట్ల అజాజ్ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!
Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి