Omicron Cases In Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు లేవు అని.. ఎవరూ ఆందోళన చెందరాదని తెలంగాణ వైద్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ అసుపత్రిలో రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మెషీన్‌ను హరీష్ రావు ప్రారంభించారు. త్వరలోనే గాంధీ ఆసుపత్రిలో 6.5 కోట్ల రూపాయలతో నూతన క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే నలభై ఐదు రోజుల్లో 12.5 కోట్ల రూపాయలతో MRIస్కాన్ మెషీన్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నామని.. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.


వచ్చే ఆరు నెలల్లో మాతాశిశు సేవల కోసం గాంధీలో 200 పడకల ఎంసీహెచ్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో గాంధీ ఆసుపత్రి సిబ్బంది అద్బుతంగా సేవలు అందించారని, క్షిష్ట పరిస్దితుల్లో 84,127మందికి వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడారని ఈ సందర్భంగా సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. ప్రైవేట్ ఆసుపత్రులు సైతం చేతులు ఎత్తేస్తున్న సమయంలో గాంధీ ఆసుపత్రి వేలాది మంది ప్రాణాలు కాపాడిందన్నారు. సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించడంపై దృష్టిపెట్టారని, గాంధీ అభివృద్ది కోసం మొత్తం రూ. 176 కోట్లు కేటాయించగా ఇప్పటికే 100 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మరో 76కోట్ల పనులు యుద్ద ప్రాతిపదికన చేస్తున్నామని చెప్పారు.


తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని, గల్ఫ్ దేశాల నుండి 3235 మంది తెలంగాణకు రాగా.. వారిలో 15 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిలో జీనోమ్ సీక్వెన్సింగ్ లో 13 మందికి నెగెటివ్ వచ్చిందని, మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 4.6 కోట్ల కరోనా టీకాలు వేయగా వీరిలో 95 శాతం మందికి మొదటి డోస్, 51 శాతం మందికి రెండో పూర్తయ్యిందన్నారు. ఎలాంటి రిస్క్ వచ్చినా మాస్క్ శ్రీరామరక్షని మార్చిపోవద్దని, ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి, వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాలని సూచించారు.
Also Read: Omicron in India: వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!
Also Read: Coivshield Third Dose : కోవిషీల్డ్ మూడో డోస్‌కు నో.. "సీరం"కు పర్మిషన్ ఇవ్వని కేంద్రం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి