గృహ, వాహన రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా? ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వడ్డీరేట్లను తగ్గించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కన్నా తక్కువ రేటుకే రుణాలు మంజూరు చేస్తోంది. ఇంటి రుణాలపై 40, కార్‌ లోన్‌పై 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ తగ్గించింది.






బ్యాంక్‌ ఆఫ్ మహారాష్ట్ర  ఇంటి రుణాలపై వడ్డీరేటును 6.8 నుంచి 6.4 శాతానికి తగ్గించింది. కార్‌ లోన్‌ను 7.05 నుంచి 6.8 శాతానికి సవరించింది. డిసెంబర్‌ 13 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. కస్టమర్లు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని బ్యాంకు కోరుతోంది. కాగా ఎస్‌బీఐ హోమ్‌లోన్‌పై కనీస వడ్డీ 6.7 శాతం, కార్‌ లోన్‌పై 7.25 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ పండగ వడ్డీరేట్లు 6.7 శాతం నుంచి అమలు చేస్తోంది.


'డిమాండ్‌ పెంచేందుకు, క్రెడిట్‌ డిపాజిట్‌ నిష్పత్తి పెంచేందుకే వడ్డీరేట్లో కోత విధించాం. ప్రస్తుత తగ్గింపు నికర వడ్డీ మార్జిన్‌పై ప్రభావం ఉండదు. ఎందుకంటే క్రెడిట్‌ వల్ల నికర వడ్డీ ఆదాయం పెరుగుతుంది' అని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ ఏఎస్‌ రాజీవ్‌ అన్నారు.






Also Read: International Commercial Flights: అంతర్జాతీయ విమాన సేవలపై కీలక ప్రకటన.. ఒమిక్రాన్ వ్యాప్తి వల్లే నిర్ణయం


Also Read: Social Media: భార్యను ట్రోల్‌ చేశారని.. బ్లాక్‌చైన్‌తో సొంత సోషల్‌ మీడియా!


Also Read: Passenger Vehicle Sales: భారీగా పడిపోయిన వాహనాల సేల్స్.. కారణం అదే.. ఇలా అయితే సమస్యలు తప్పవు!


Also Read: Petrol-Diesel Price, 12 December: వాహనదారులకు స్వల్ప ఊరట.. స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరంలో భారీ పెరుగుదల


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్.. రూ.140 పెరిగిన ధర, ఎగబాకిన వెండి రేటు


Also Read: Aadhaar Card News: ఆధార్‌ కార్డులో అడ్రెస్, పేరు, పుట్టిన తేదీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?