ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 160 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ బారినపడి.. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కొవిడ్ నుంచి 201 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలోని ఇప్పటి వరకు మొత్తం 20,71,973 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 20,55,595 మంది డిశ్ఛార్జి అయ్యారు. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటి వరకు.. 14,466 మంది మరణించారు. ప్రస్తుతం 1912 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో కేసులు
దేశంలో కొత్తగా 7,774 కరోనా కేసులు నమోదుకాగా 306 మంది మృతి చెందారు. తాజాగా 8,464 మంది కరోనా నుంచి రికవరయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 92,281కి చేరింది. గత 560 రోజుల్లో ఇదే అత్యల్పం.
- మొత్తం మరణాలు: 4,75,434
- యాక్టివ్ కేసులు: 92,281
- కోలుకున్నవారు: 3,41,22,795
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం రికవరీల సంఖ్య 3,41,22,795కు పెరిగింది. రికవరీ రేటు 98.36 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. ఇప్పటివరకు 65.58 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 132.93 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దిల్లీలో తాజాగా 35 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అతను జింబాబ్వే, దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. దిల్లీలో ఇది రెండో ఒమిక్రాన్ కేసు. ప్రస్తుతం అతనికి ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతనికి పూర్తి వ్యాక్సినేషన్ అయినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 17 కేసులు నమోదుకాగా రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, దిల్లీలో 2 కేసులు వెలుగుచూశాయి.
Also Read: East Godavari: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో