ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకంది. ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌమ్యాద్రి, ముఖేష్, వికాస్‌లను వైద్య పరీక్షల అనంతరం మచిలీపట్నం తరలించారు. అక్కడ నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవకతవకలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, పూణే, ముంబయి, దిల్లీలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత
విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు
ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో శుక్రవారం సీఐడీ అధికారులు సోదాలు చేశారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పని చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలకు వచ్చారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా సోదాలు చేశారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.
Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో
అసలేం జరిగింది?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు నమోదు చేసింది సీఐడీ. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు, ప్రభుత్వానికి విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ పేర్కొంది. 2017-18లో రూ.371 కోట్లలలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్ జరిగాయని సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
Also Read: కొడుకు పెళ్లి కోసం ఊరికి రోడ్డు... ఓ తండ్రి ఆలోచనపై గ్రామస్తుల హర్షం