బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రవి ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 5లో ఉంటాడనుకున్న రవి ఇలా ఎలిమినేట్ అవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ విషయంలో బిగ్ బాస్ షోపై దారుణమైన విమర్శలు చేశారు. కావాలనే రవిని హౌస్ నుంచి పంపించేశారంటూ మండిపడ్డారు. రవి తల్లి కూడా ఈ విషయంలో బాధ పడ్డారు. షోకి పిలిచి అవమానించారంటూ.. మీడియా ముందు చెప్పారు. బిగ్ బాస్ తన కొడుక్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా.. ప్రేక్షకులు ఇస్తున్నారని అన్నారు. 


ఇక హౌస్ నుంచి బయటకొచ్చిన రవిని టార్గెట్ చేస్తూ.. కొందరు ట్రోలింగ్ చేశారు. రవి కూతురు వియాను కూడా విడిచిపెట్టలేదు. ఏమైనా ఉంటే తనను అనాలి కానీ ఫ్యామిలీ జోలికి ఎందుకు వస్తున్నారని రవి నెటిజన్లను ప్రశ్నించాడు. హద్దులు దాటితే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. 


అయితే రీసెంట్ గా కొందరు చేసిన కామెంట్స్ రవిని బాధించాయి. దీంతో వారిపై పోలీస్ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. రవి.. సిరిని సపోర్ట్ చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఓ నెటిజన్ అయితే 'నువ్ గర్వపడడానికి సిరి ఇండియాకు మెడల్ తీసుకురాలేదు. నానా పనులు చేసి టాప్ 5కి వచ్చింది. షణ్ముఖ్ ని తమ్ముడు అంటావ్.. కొంచెమైనా సిగ్గుందా..? వియాకి ఇలాంటివే నేర్పిస్తున్నావా..?' అంటూ రాసుకొచ్చింది.


 ఈ కామెంట్ చూసిన రవి చాలా సీరియస్ అయ్యాడు. 'నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నా కూతురు గురించి ప్రస్తావించినందుకు మీపై పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాను' అని చెప్పాడు రవి. మరికొందరు నెటిజన్లు పెట్టిన కామెంట్స్ ని పోస్ట్ చేసిన రవి.. 'ఇంత గలీజ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు..?' అని ప్రశ్నించాడు. ఇక నుంచి సోషల్ మీడియాలో వచ్చే ఏ నెగెటివ్ కామెంట్ ని సహించేదే లేదని.. ఫేక్ అకౌంట్స్ తో ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారిని సైబర్ క్రైమ్ పోలీసులు విడిచిపెట్టరని వార్నింగ్ ఇచ్చాడు రవి. అసభ్యంగా కామెంట్స్ చేసేవారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు రవి.  


Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ..



Also Read: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో


Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?