యూజీసీ నెట్​ డిసెంబర్​-2021 ఫేజ్​-2 పరీక్షలు డిసెంబర్​ 24 నుంచి డిసెంబర్​ 30 వరకు జరుగుతాయి. కొన్ని కారణాలతో ఫేజ్​-1లో రీషెడ్యూల్ చేశారు. అయితే ఆ పేపర్లు కూడా డిసెంబర్​ 30న నిర్వహిస్తారు. ఈ మేరకు ప‌రీక్ష తేదీల‌ు విడుదలయ్యాయి.


యూనివర్సిటీల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్ల అర్హత, పీహెచ్​డీ ప్రవేశాల కోసం ప్రతి ఏటా నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష ఫేజ్​-1 పరీక్షలు ఈమధ్యే పూర్తయ్యాయి. ఫేజ్​-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. జవాద్​ తుపానుతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఫేజ్ 1 పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే వాటిని కూడా నిర్వహించాల్సి ఉంది. ఫేజ్​ 1లో మిగిలిన ఏరియాలతో పాటు ఫేజ్​ 2 పరీక్షల కోసం కొత్త టైమ్​ టేబుల్​ విడుదలైంది. 


www.nta.ac.inలో ఈ వెబ్ సైటల్ కొత్త షెడ్యూల్​ చూసుకోవచ్చు.  యూజీసీ నెట్​ డిసెంబర్​-2021 ఫేజ్​-2 పరీక్షలు డిసెంబర్​ 24 నుంచి డిసెంబర్​ 30 వరకు నిర్వహిస్తారు. లేబర్ వెల్ఫేర్, సోషల్ వర్క్, ఒడియా, తెలుగు సహా ఫేజ్ 1లో రీషెడ్యూల్ చేసిన పేపర్లను 2021 డిసెంబర్ 30న జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉండగా.. రెండో షిప్ట్‌ను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. 


కరోనా కారణంగా డిసెంబర్​ 2020 పరీక్షలు వాయిదా పడిని విషయం తెలిసిందే. ఈ కారణంగా జూన్​-2021 షెడ్యూల్ ఆలస్యమైంది. డిసెంబర్​ 2020, జూన్​ 2021 రెండు సెషన్లను విలీనం చేసి ఒకేసారి నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్ నిర్ణయం తీసుకుంది.


అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి అంశాలు..


పరీక్షకు వెళ్లే.. అభ్యర్థులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ఏవైనా సందేహాలుంటే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. హెల్ప్ లైన్​ 011-40759000 నెంబర్ కు ఫోన్ చేయోచ్చు. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు.. యూజీసీ మార్గదర్శకాలను చదువుకోండి. అధికారిక వెబ్ సైట్ లో పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్​ కార్డులు అందుబాటులోకి ఉంటాయి.


Also Read: CTET Exam 2021: సీటెట్‌ హాల్‌టికెట్‌ మీకు రాలేదా.. అప్లికేషన్ సరిదిద్దుకోండిలా


Also Read: Online Course: టీసీఎస్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ కోర్సు నేర్చుకోండి.. ఎంతో ఉపయోగపడొచ్చు


Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్‌