గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవ‌కాశం లభించనుంది. ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పోటీ కూడా పెరుగుతోంది. అంద‌రి క‌న్నా భిన్నంగా ఉంటేనే.. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కొత్త కోర్సులను నేర్చుకునే వారి కోసం.. టీసీఎస్ ఆన్‌లైన్ ఉచిత కోర్సు ప్రారంభిస్తోంది. మెరుగైన నైపుణ్యం నేర్చుకుని.. ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు పదిహేను రోజులు ఉంటుంది. ఈ కోర్సు యువ‌త‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని టీసీఎస్ పేర్కొంది.


గ్రామీణ విద్యార్థులు.. ఇబ్బంది పడుతున్న ఇంగ్లీష్ పై ప్రత్యేక కోర్సును అందిస్తున్నారు. బిహేవిరియ‌ల్ అండ్ క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజ‌న్స్‌ పై కోర్సులు ఉన్నాయి. దీనికి దరఖాస్తు చేసుకునే వారికి వారం రోజులపాటు.. కనీసం.. క‌నీసం 7 నుంచి 10 గంట‌ల కోర్సు అందిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ నేర్చుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
 
14 మాడ్యూల్స్ లో భాగంగా ప్రతీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంట‌ల వీడియోలు ఉంటాయి. ఒకవేళ విద్యార్థులకు ఏదైనా సందేహాలు తలెత్తితే.. ప్రశ్నలు అడగొచ్చు. ఈ కోర్స్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన‌ వారికి ప్రతిభ ఆధారంగా.. సర్టిఫికెట్లు అందిస్తారు.   
కోర్సు నేర్చుకోవాలనుకునే వారు.. ఆన్‌లైన్ లో  అప్లె చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ కోసం ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.


Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్‌


Also Read: Osmania University: ఓయూలో ఫ్యాకల్టీ స్టూడెంట్స్‌కు కొత్తగా రీసెర్చ్ అవార్డులు.. వీసీ వెల్లడి, పూర్తి వివరాలివీ..


Also Read: Visa Interview: అబ్బా.. చీ.. వీసా ఇంటర్వ్యూ మళ్లీ పోయింది.. ఎలా ప్రయత్నిస్తే బెటర్ అంటారు? 


Also Read: Takshashila University: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..


Also Read: Interview: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలి? 


Also Read: Oxford Dictionary: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 ఏంటో తెలుసా.. మీకు బాగా తెలిసిన పదమేలే!


Also Read: Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా